IPL 2025: వీడొక మెంటలోడు భయ్యా.! రాసిపెట్టుకోండి.. ఈసారి SRH 300 స్కోర్ పక్కా..

Written by RAJU

Published on:


IPL 2025: వీడొక మెంటలోడు భయ్యా.! రాసిపెట్టుకోండి.. ఈసారి SRH 300 స్కోర్ పక్కా..

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.11 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. సీజన్ స్టార్ట్ కాకముందే ఇంట్రా-డే మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కావ్య మారన్ ఛాయస్ కరెక్ట్ అని మరోసారి రుజువైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టిస్ చేస్తోంది. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ కేవలం 42 బంతుల్లో 113 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కేవలం 23 బంతుల్లోనే 64 పరుగులు చేయగా, మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు.

ఇషాన్ కిషన్ విధ్వంసం..

ఇషాన్ కిషన్ సూపర్బ్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు భయం పుట్టించేలా సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగితే.. ప్రత్యర్ధులకు చుక్కలే. ఇక ఆసక్తికర విషయమేంటంటే.. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా మిడిలార్డర్‌లో ఉండటంతో.. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

హైదరాబాద్ చివరిసారి 300 పరుగులు మిస్..

గత ఐపీఎల్ సీజన్‌లో 30వ మ్యాచ్‌ అందరూ ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని రికార్డులను బద్దలు కొట్టి 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. ఆర్‌సీబీపై హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు 22 సిక్సర్లు బాదారు. ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు చేయగా, అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఇషాన్ కిషన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ నుంచి కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్లు మాత్రమే 74 సిక్సర్లు కొట్టారు. గత సీజన్‌లో ఇద్దరు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు కలిపి 74 సిక్సర్లు బాదారు. అభిషేక్ శర్మ ఒక్కడే 42 సిక్సర్లు కొట్టాడు. పెద్ద విషయం ఏమిటంటే.. గత సీజన్‌లో ట్రావిస్ హెడ్ 32 సిక్సర్లు కొట్టగా, క్లాసెన్ 38 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు బాగా రాణిస్తే.. 22 గజాల పిచ్‌పై ఎలాంటి విస్ఫోటనం జరుగుతుందో ఊహించడం కష్టం.

Subscribe for notification