IPL 2025: రాజస్తాన్ రాయల్స్ కు మరో ఎదురుదెబ్బ.. గాయంతో టోర్నీకి దూరం కానున్న కీ బౌలర్?

Written by RAJU

Published on:


రాజస్తాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ ముంబై ఇండియన్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌కి గైర్హాజరయ్యాడు. ఆయనకు వేలి ముడిచిప్పు (fractured finger) కారణంగా ఈ సీజన్ మిగిలిన మ్యాచ్‌లలో ఆడే అవకాశాలు సందిగ్ధంగా ఉన్నాయి. రాజస్తాన్ రాయల్స్ తన అధికారిక X ( Twitter) ఖాతాలో “త్వరగా కోలుకో” అని సందేశం పెట్టగా, సందీప్ శర్మ చేతికి స్లింగ్‌ ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కాగా గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్యాచ్‌ పట్టే ప్రయత్నంలో గాయపడ్డ సందీప్ కొన్ని మ్యాచ్ లకు దూరం అయ్యే అవకాశముంది.

సందీప్ స్థానంలో ఆకాశ్ మాధ్వాల్

రైట్ ఆర్మ్ పేసర్ ఆకాశ్ మాధ్వాల్, రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. అతను గత రెండు సీజన్లలో (2023, 2024) ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌లో అతను లక్నో సూపర్ జెయింట్స్‌పై 5/5 బౌలింగ్ ఫిగర్స్‌తో సంచలనం సృష్టించాడు.

కాగా ముంబై తో మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో మూడు మార్పులు చోట చేసుకున్నాయి. వనిందు హసరంగా స్థానంలో కుమార్ కార్తికేయ, యుధ్వీర్ సింగ్ స్థానంలో ఫజల్హాక్ ఫరూకీ, సందీప్ శర్మ స్థానంలో ఆకాశ్ మాధ్వాల్ ఆడుతున్నారు.

రాజస్తాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:

వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్, మాహీష్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మాధ్వాల్, ఫజల్హాక్ ఫరూకీ

ఇంపాక్ట్ ప్లేయర్స్: శుభం దూబే, తుషార్ దేశ్‌పాండే, కునాల్ రాథోర్, యుధ్వీర్ చరక్, క్వెనా మాఫాకా

రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి

రాజస్తాన్ రాయల్స్ 10 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలతో 6 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది రాజస్థాన్ రాయల్స్. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలవడం తప్పనిసరి. ఓటమికి ఇక అవకాశమే లేదు. అంతే కాదు నెట్ రన్ రేట్ కూడా భారీగా పెంచుకోవడం తో పాటు ఇతర జట్ల విజయాలు, అపజయాల మీద ఆధారపడవలసి ఉంటుంది.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI:

రోహిత్ శర్మ, రియన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

ఇంపాక్ట్ ప్లేయర్స్: రాబిన్ మిన్జ్, రాజ్ బావా, కర్ణ్ శర్మ, రీస్ టోప్లీ, సత్యనారాయణ రాజు

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights