ఐపీఎల్ 2024 సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఒక పీడకల లాంటిదని చెప్పవచ్చు. ఆ సీజన్‌లో ముంబై కేవలం నాలుగంటే నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి.. 10 మ్యాచ్‌లు ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అదే సీజన్‌లో రోహిత్ శర్మ ప్లేస్‌లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్ అవ్వడం, ముంబై ఫ్యాన్స్‌తో పాటు రోహిత్ ఫ్యాన్స్ కూడా ప్యాండ్యాను దారుణంగా ట్రోల్ చేశారు. అసలు లాస్ట్ సీజన్ ముంబై జట్టు ఒక దారుణ పరిస్థితి ఎదుర్కొంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత పాండ్యాపై అభిమానులకు కోపం పూర్తిగా తగ్గిపోయింది. ముంబై ఇడియన్స్ కెప్టెన్‌గా అతన్ని ముంబై అభిమానులు యాక్సెప్ట్ చేశారు. రోహిత్ కెప్టెన్ కాదు అనే విషయాన్ని మెల్లమెల్లగా జీర్ణించేసుకున్నారు. సో.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కూల్‌గా బరిలోకి దిగనుంది.
లాస్ట్ సీజన్‌లో ఎదురైన ఓటములకు ఈ సారి బదులు తీర్చుకోవాలని కసితో బరిలోకి దిగనుంది. మరి ఐపీఎల్ 2024లో ఎదురైన ఘోర ఓటములకు ఈ ఐపీఎల్ సీజన్‌లో బదులు తీర్చుకునేంత స్ట్రాంగ్‌గా ముంబై ఇండియన్స్ ఉందా? ఆ జట్టు బలమేంటి? బలహీనతలేంటి? జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ భారీ భారీ ధరలు చెల్లించి తమ స్టార్ గ్రూప్ మొత్తాన్ని రిటేన్ చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మలను వారితోనే అంటిపెట్టుకున్నారు. సో వాళ్ల టీమ్ సోల్ వారితోనే ఉండిపోయింది. రోహిత్ శర్మ బయటికి వచ్చేస్తాడనే ప్రచారం జరిగినా.. అతన్ని ఎలాగోలా బుజ్జగించేసింది ముంబై యాజమాన్యం.
సో.. ఓవరాల్‌గా ముంబై టీమ్ చూసుకుంటే బ్యాటింగే వారి బలంలా కనిపిస్తోంది. రోహిత్ శర్మతో కలిసి సౌతాఫ్రికా కొత్త కుర్రాడు ర్యాన్ రికల్టన్ ఓపెనింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, హార్థిక్ పాండ్యా, నమన్ ధీర్ ఇలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తోంది. రోహిత్, సూర్య, తిలక్ ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు నిల్చున్నా.. భారీ స్కోర్ ఖాయం. ముఖ్యంగా పవర్ ప్లేలో రోహిత్ శర్మ ఎటాకింగ్ గేమ్ ముంబైకి చాలా ప్లస్ అవుతుంది. ఒక వేళ రోహిత్ క్లిక్ అయి పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ రన్స్ చేస్తే.. తర్వాత ముంబైకి ఉన్న లాంగ్ బ్యాటింగ్ లైనప్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. సో వచ్చిన వాళ్లు వచ్చినట్లే బ్యాట్‌ను ఊపేయొచ్చు. కనెక్ట్ అయ్యిందా.. మ్యాచ్ ముంబై చేతుల్లోకి వచ్చేసినట్లే.
ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికి వస్తే.. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడిని చూస్తేనే ప్రత్యర్థి జట్లు గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అలాంటిది బుమ్రాకు జోడీగా ట్రెంట్ బౌల్ట్ కూడా ఈ సారి ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు. బుమ్రా, బౌల్ట్ జోడీ కచ్చితంగా ముంబైకి మ్యాచ్‌లు గెలిపించే జోడీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరితో పాటు వికెట్ టేకింగ్ ఎబిలిటీ పుష్కలంగా ఉన్న కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. అలాగే కరణ్ శర్మ, దీపక్ చాహర్ కూడా ముంబై టీమ్లో ఉన్నారు. ఆల్‌రౌండర్లలో మిచెల్ సాంట్నర్ ముంబైకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే విల్ జాక్స్ కూడా బౌలింగ్ చేయగలడు. సో.. ముంబైకి మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్‌లో కనిపిస్తున్న మైనస్‌లా విషయానికి వస్తే.. బ్యాటింగ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా.. రోహిత్ శర్మ సరైన ఫామ్‌లో లేకపోవడం కచ్చితంగా వారిని కలవర పెట్టే అంశం.
రోహిత్ త్వరగా అవుటైపోతే.. తర్వాత వచ్చే ప్లేయర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక హార్ధిక్ పాండ్యాపై తొలి మ్యాచ్ నిషేధం, జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం కూడా ముంబై ఇండియన్స్‌కి నష్టం చేసే అవకాశం ఉంది. అయినా ముంబై తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోతే వాళ్లకు కలిసొస్తుందని ఫ్యాన్స్ అనుకోవచ్చు. వారి నమ్మకాలు వాళ్లవి. కానీ, పేపర్‌పై ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా.. ఫీల్డ్‌లో కూడా అంతే ఇంప్యాక్ట్ చూపిస్తారా? అనే డౌట్ చాలా మందిలో ఉంది. అది తెలియాలంటే మ్యాచ్‌లు మొదలయ్యే దాకా ఆగాల్సిందే. ఇక ముంబై పిచ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు.
రోహిత్, సూర్య అక్కడే పుట్టిపెరిగారు కాబట్టి హోం అడ్వాంటేజ్ ముంబై ఇండియన్స్‌కు ఉన్నంత మరే టీమ్‌కు ఉండకపోవచచ్చు. ఇక చివరిగా ముంబై ఇండియన్స్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందని అని చూస్తూ.. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్ర, ట్రెంట్ బౌల్ట్‌లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండే ఛాన్స్ ఉంది. ఆరంభ మ్యాచ్‌లో మార్పులు ఉండొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.