IPL 2025: ఫేవరేట్ ఇండియన్ క్రికెటర్ పేరు చెప్పేసిన SRH ఓపెనర్.. సచిన్, విరాట్ కాదు భయ్యో!

Written by RAJU

Published on:


టీమిండియా లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మే తన ఫేవరేట్ ఇండియన్ క్రికెటర్ అని ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రకటించాడు. రోహిత్ బ్యాటింగ్‌ శైలి తనకు ఎంతో ఇష్టమని, అతని కెప్టెన్సీ కూడా అద్భుతమని ప్రశంసించాడు. ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రావిస్ హెడ్ తన అభిమాన భారతీయ ఆటగాడు రోహిత్ శర్మ అని తేల్చేశాడు. ఇంటర్వ్యూలోని క్వశ్చన్-ఆన్సర్ సెషన్‌లో మూడు ప్రశ్నలకు వరుసగా రోహిత్ శర్మ పేరు చెప్పడంతో, రోహిత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “ఇతను నిజంగా రోహిత్ ఫ్యాన్ అయిపోయాడుగా!” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రోహిత్ శర్మ తనకు ఇష్టమైన ఇండియన్ బ్యాటర్ అని చెప్పడమే కాకుండా, టీమిండియాలో అతని జట్టులో ఉండాలనుకునే ఆటగాడు కూడా రోహిత్ శర్మే అని ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు. అంతేకాకుండా, సన్‌రైజర్స్ హైదరాబాద్ కాకుండా మరో ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఆడాల్సి వస్తే ముంబై ఇండియన్స్‌ను ఎంచుకుంటానని కూడా చెప్పారు. ఇది రోహిత్ శర్మంటే అతనికి ఎంత అభిమానం ఉందో చూపిస్తుంది.

అయితే, ఐపీఎల్ 2025 సీజన్‌లో ట్రావిస్ హెడ్ రాణించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీనే నమోదు చేయగలిగాడు. అతని స్కోర్లు 67, 47, 22, 4, 8గా ఉన్నాయి. ఇన్నింగ్స్ తగ్గడమే కాకుండా, అతని అంచనాలకు తగ్గ ఆటతీరు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కూడా ప్రభావితం చేస్తోంది. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

ఈ నేపథ్యంలో శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో అయినా ట్రావిస్ హెడ్ మంచి ఇన్నింగ్స్‌తో రాణించాలని, ఓ అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు వెళ్లాలని భావించేంతగా రోహిత్ శర్మను అభిమానించే హెడ్, ఇప్పుడు తన ప్రదర్శన ద్వారా కూడా అదే స్థాయిలో అభిమానుల గుండెల్లో నిలవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights