నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్‌కు శుభవార్త అందింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో, ముంబై తన మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. కానీ ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇంతలో, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం గురించి ముంబై ఇండియన్స్‌కు కీలక వార్త వచ్చింది. నివేదిక ప్రకారం, బుమ్రా రాబోయే కొద్ది రోజుల్లో తిరిగి జట్టులోకి వస్తాడుని, త్వరలో ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటనలో వెన్నునొప్పి కారణంగా బుమ్రా క్రికెట్‌కు దూరమయిన సంగతి తెలిసిందే. దీని కారణంగా, అతను ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడలేకపోయాడు. అప్పటి నుంచి బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వైద్య బృందం పర్యవేక్షణలో తన ఫిట్‌నెస్‌పై పని చేస్తున్నాడు.బుమ్రా ఇటీవల బెంగళూరులోని COEలో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. బుమ్రా వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నాడని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ, అతని బౌలింగ్ పనిభారం క్రమంగా పెరగడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ రాలేదు.
ఇప్పుడు, ESPN-Cricinfo నివేదిక ప్రకారం, బుమ్రా ఫిట్నెస్ పరీక్షల చివరి రౌండ్‌కు దగ్గరగా ఉన్నాడు. రాబోయే కొద్ది రోజుల్లో అతను COEలో ఫిట్నెస్ పరీక్ష చేయించుకుంటాడని తెలుస్తోంది. ఇది పూర్తి సామర్థ్యంతో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని ఫిట్నెస్ ఎలా ఉంటుందో చూస్తారు. బుమ్రా ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే, అతను జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అయితే, అతను ముంబై తదుపరి 2 మ్యాచ్‌లలో, ఏప్రిల్ 4న లక్నో, ఏప్రిల్ 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడటానికి అవకాశం లేదు. కానీ, బుమ్రా ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో కాకపోతే, ఏప్రిల్ 17న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో అతను మళ్ళీ మైదానంలో కనిపిస్తాడు.