IPL 2025: కావ్య మారన్ బృందానికి బెదిరింపులు.. కట్‌చేస్తే.. ఉప్పల్ నుంచి తరలనున్న ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లు

Written by RAJU

Published on:


IPL 2025 SRH-HCA Conflict: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోన్న కావ్య మారన్ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇప్పుడు తన సొంత మ్యాచ్‌లను వేరే వేదికకు మార్చాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు తన అన్ని హోమ్ మ్యాచ్‌లను ఉప్పటల్ స్టేడియంలోనే ఆడుతుంది. కానీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తో కొనసాగుతున్న వివాదం కారణంగా హైదరాబాద్ ఫ్రాంచైజీ తన హోమ్ గ్రౌండ్‌ను మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా బయటకు వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ బెదిరింపులకు పాల్పడుతోందని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ఆరోపణలు చేసింది. మీడియా నివేదికల ప్రకారం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నతాధికారులు ఉచిత టిక్కెట్ల కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంట. ఈ బెదిరింపులతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ అసంతృప్తికి గురైందని, దీంతో SRH తన మిగిలిన హోమ్ మ్యాచ్‌లను వేరే వేదికకు మార్చాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

HCA పై ఆరోపణలు..

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు జనరల్ మేనేజర్ శ్రీనాథ్ టీబీ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావుకు ఒక ఇమెయిల్ రాశారంట. ” హెచ్సీఏ అధ్యక్షుడు చేసిన బెదిరింపులతో సన్‌రైజర్స్ ఇకపై ఉప్పల్ స్టేడియంలో ఆడటం ఇష్టం లేదని స్పష్టంగా చూపిస్తున్నాయి” అంటూ మెయిల్ చేశారంట.

ఇవి కూడా చదవండి

ఉచిత టిక్కెట్లపై రగడ..

‘మేం గత 12 సంవత్సరాలుగా HCAతో కలిసి పనిచేస్తున్నాం. కానీ గత సీజన్ నుంచి మేం నిరంతరం సమస్యలు, వేధింపులను ఎదుర్కొంటున్నాం. చాలా సంవత్సరాలుగా హెచ్‌సీఏకి 3,900 ఉచిత టిక్కెట్లతోపాటు 50 F12A బాక్స్ టిక్కెట్లు అందిస్తున్నాం. కానీ, ఇప్పుడు ఈ బాక్స్ సామర్థ్యం 30 మాత్రమే. అయితే, F12A బాక్స్‌లో అదనంగా 20 ఉచిత టిక్కెట్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. చర్చల ద్వారా దీనిని పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం” అంటూ శ్రీనాథ్ ఈమెయిల్‌లో ఆరోపించినట్లు తెలుస్తోంది.

వివాదం ఎలా మొదలైంది?

నిజానికి, మార్చి 27న హైదరాబాద్ వర్సెస్ లక్నో (SRH vs LSG) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా, HCA ప్రతినిధులు F3 బాక్స్‌లో అదనంగా 20 టిక్కెట్లు అడిగారు. కానీ, ఫ్రాంచైజీ అదనపు టిక్కెట్లు అందించడానికి నిరాకరించడంతో వివాదం తలెత్తింది. ఐపీఎల్ సమయంలో స్టేడియం అద్దె తాము చెల్లిస్తున్నామని, స్టేడియంపై హక్కులు తమకు ఉంటాయని, కాబట్టి అదనపు టిక్కెట్లను ఉచితంగా ఇవ్వలేమని ఫ్రాంచైజీ వాదించింది. దీంతో హెచ్‌సీఏలోని కొంతమంది అధికారులు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights