IPL 2025: ఒక్క వికెట్‌ కూడా తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు! వీడు మామూలోడు కాదు..

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అన్ని టీమ్స్‌ ఒక్కో మ్యాచ్‌ ఆడేశాయి. మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఐదు మ్యాచ్‌లు పూర్తి అయి, పది టీమ్స్‌ ఒక్కో మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాయి. కాగా గుజరాత్‌తో అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించి, ఈ 18వ ఐపీఎల్‌ సీజన్‌ను గ్రాండ్‌గా మొదలుపెట్టింది. ఈ విజయంలో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య, ఫినిషర్‌ శశాంక్‌ సింగ్‌ పాత్ర ఎంతుందో.. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి అప్పటి వరకు గుజరాత్‌ వైపు ఉన్న మ్యాచ్‌ మూమెంటమ్‌ను పూర్తిగా పంజాబ్‌ వైపు మార్చిన విజయ్‌ కుమార్‌ వైశాక్‌ పాత్ర కూడా అంతకంటే ఎక్కువే ఉంది. ముఖ్యంగా అతను వేసిన ఇన్నింగ్స్‌ 15, 17 ఓవర్లు మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. ఆ రెండు ఓవర్లలో కేవలం ఐదేసి పరుగులు మాత్రమే ఇచ్చాడు.

దీంతో గుజరాత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. రిక్వైర్డ్‌ రన్‌ రేట్‌ ఒక్కసారిగా అసాధ్యంగా మారిపోయింది. పంజాబ్‌ బ్యాటర్లకు ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా అన్ని అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ వైడ్‌ యార్కర్లు వేస్తూ.. బట్లర్‌, రూథర్‌ఫర్డ్‌ చేతులు కట్టేశాడు. దీంతో రన్స్‌ రాక గుజరాత్‌ ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌లో ఎంతో కీలకమైన 19 ఓవర్‌ వేసి 18 పరుగులు ఇచ్చాడు. అన్ని రన్స్‌ ఇచ్చినా కూడా అది మంచి ఓవర్‌గానే వెళ్లింది. ఎందుకంటే.. అంతకుముందు అతను వేసిన మంచి ఓవర్లలో గుజరాత్‌కు 18 కంటే చాలా ఎక్కువ రన్స్‌ కావాల్సి ఉంది. చివరి ఓవర్‌లో అర్షదీప్‌ సింగ్‌ పని ఈజీ చేసి పెట్టాడు విజయ్‌ కుమార్‌. అయితే.. ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. మూడు ఓవర్లు వేసిన విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ 28 రన్స్‌ ఇచ్చి.. ఒక్క వికెట్‌ కూడా తీసుకోలేదు.

కానీ, పంజాబ్‌ మ్యాచ్‌ గెలిచిందంటే అతనే కారణం. ఆ రెండు ఓవర్లలో ఐదేసి రన్స్‌ కాకుండా భారీగా రన్స్‌ ఇచ్చి ఉంటే.. గుజరాత్‌ ఈజీగా టార్గెట్‌ కొట్టేసేది. విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌కి వచ్చిన సమయంలో గుజరాత్‌ చేతుల్లో 8 వికెట్లు ఉన్నాయి. సో.. వాళ్లు రన్స్‌ కోసం అగ్రెసివ్‌గా ఆడేవాళ్లు, ఈ ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ వాళ్లుకు అసలు షాట్లు ఆడే ఛాన్స్‌ ఇవ్వలేదు. 19వ ఓవర్‌ చివరి బంతికి తెవాటియా ఒక్క సిక్స్‌ మాత్రం కొట్టాడు అంతే. మ్యాచ్‌ తర్వాత.. గుజరాత్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ.. తమ ఓటమికి మధ్యలో కొన్ని ఓవర్లలో సరైన పరుగులు రాకపోవడమే అని ఒప్పుకున్నాడు. ఇలా విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ తియ్యకపోయినా.. పంజాబ్‌కు మ్యాచ్‌ గెలిపించి పెట్టాడు. గత రెండు సీజన్స్లో విజయ్‌ ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification