IPL 2025: ఒక్క ట్రోఫీ కూడా లేని ఆ టీమ్‌ను చూసి ఇప్పుడు SRH నేర్చుకోవాలి! ఆరెంజ్‌ ఆర్మీ టార్గెట్‌ అదే..

Written by RAJU

Published on:


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ 2025లో తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌ను వాళ్ల హోం గ్రౌండ్‌లో ఓడించి.. ఈ సీజన్‌లో మూడో విజయం సాధించింది. మొత్తంగా 9 మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది మూడో విజయం. దీంతో వారి ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. ఫ్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌ మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. మొత్తంగా 16 పాయింట్లతో సన్‌రైజర్స్‌ సేఫ్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. అలా కాదు.. 5లో 4 గెలిస్తే.. అప్పుడు 14 పాయింట్లతో రన్‌రేట్‌ మెరుగ్గా ఉంటే.. అప్పుడు కూడా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.

రాబోయే ఐదు మ్యాచ్‌ల్లో.. మే 2న గుజరాత్‌ టైటాన్స్‌తో అహ్మాదాబాద్‌లో, మే5న ఢిల్లీ క్యాపిటిల్స్‌తో ఉప్పల్‌లో, మే కేకేఆర్‌తో ఉప్పల్‌లో, మే 13న ఆర్సీబీతో బెంగళూరులో, మే 18న ఎల్‌ఎస్‌జీతో లక్నోలో మ్యాచ్‌లు ఆడనుంది సన్‌రైజర్స్‌. ఈ సీజన్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ ఎల్‌ఎస్‌జీ మధ్యే జరగనుంది. ఒక వేళ రన్‌రేట్‌ కీలకంగా మారితే.. ఎన్ని రన్స్‌ తేడాతో గెలవాలి, ఎన్ని ఓవర్లు మిగిలి ఉండగా టార్గెట్‌ చేజ్‌ చేయాలి అనే విషయాలు ఎస్‌ఆర్‌హెచ్‌కు ముందు తెలుస్తాయి కాబట్టి కాస్త అడ్వాంటేజ్‌ అయితే ఉంది. కానీ, ఐదు మ్యాచ్‌ల్లో.. గుజరాత్‌, ఢిల్లీ, ఆర్సీబీ, లక్నో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాయి.

ప్రస్తుతం పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ 3 టీమ్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఇది కాస్త ఎస్‌ఆర్‌హెచ్‌ను కలవర పెట్టే అంశం. ఎందుకంటే.. సూపర్‌ ఫామ్‌లో ఉండి, ఇప్పటికే ఆరేసి మ్యాచ్‌లు గెలిసి ప్లే ఆఫ్స్‌కు చేరువలో ఉన్న టీమ్స్‌పై మ్యాచ్‌లు గెలవడం అంత సులువైన విషయం కాదు. ఆ టీమ్‌లోని బ్యాటర్లు, బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు, పైగా ఆయా టీమ్స్‌లో ఒక పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. సో.. ఈ టీమ్స్‌పై గెలవాలంటే.. కచ్చితంగా మన సామర్థ్యానికి మించిన ఎఫర్ట్స్‌ పెట్టాలి. మనదైన రోజున ఎంత పెద్ద ఛాంపియన్‌ టీమ్‌నైనా ఓడిస్తామంటే.. ఎస్‌ అది కూడా వర్క్‌అవుట్‌ కావొచ్చు. కానీ, టాప్‌ 3 టీమ్స్‌నైతే అస్సలు తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆరెంజ్‌ ఆర్సీబీ సీఎస్‌కేపై గెలవడం, కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాటర్లు అదరగొట్టడం ఎస్‌ఆర్‌హెచ్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడంలో అనుమానం లేదు. ఈ కాన్ఫిడెన్స్‌తో పాటు.. లాస్ట్‌ సీజన్‌లో ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో.. అంతకంటే టఫ్‌ సిచ్యుయేషన్‌లో ఉండి కూడా.. ఓ టీమ్‌ ప్లే ఆప్స్‌కు క్వాలిఫై అయింది. తొలి 8 మ్యాచ్‌ల్లో ఆ జట్టు కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలిచింది. అప్పుడు ఆ టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్లగలిగే అవకాశం కేవలం ఒక్క శాతం మాత్రమే.

అలాంటి పరిస్థితుల్లో తర్వాత ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా గెలిచి.. ఒక్క శాతం అవకాశాన్ని వంద శాతంగా మార్చుకొని.. 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. ఆ టీమ్‌ మరేదో కాదు ఆర్సీబీ. 2024 సీజన్‌లో ఆర్సీబీ ఈ అద్భుతం చేసి చూపించింది. ఒక్క శాతం అవకాశం ఉన్నా కూడా వదలకుండా పోరాడితే ఫలితం ఉంటుందని నిరూపించింది. అలాగే 2014లో కేకేఆర్‌ కూడా తమ చివరి 6 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఈ రెండు టీమ్స్‌ మాత్రమే.. సీజన్‌లోని చివరి 6 మ్యాచ్‌ల్లో 6కు 6 విజయాలు సాధించిన జట్లు. ఇప్పుడు ఆ రికార్డును సాధించే అవకాశం ఎస్‌ఆర్‌హెచ్‌కు ఉంది.

ఆర్సీబీని స్ఫూర్తిగా తీసుకొని.. మిగిలిన 5 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. చివరి 6 మ్యాచ్‌ల్లో గెలిచిన మూడో టీమ్‌గా చరిత్ర సృష్టించడమే కాకుండా.. కంఫర్ట్‌బుల్‌గా ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. లాస్ట్‌ సీజన్‌లో ఒక్క అడుగు దూరంలో మిస్‌ అయిన ట్రోఫీని ఈ సీజన్‌లో కొట్టే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే.. ఒక్కసారి ప్లే ఆఫ్స్‌కు చేరితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ కాన్ఫిడెన్స్‌ రెడ్‌ హాట్‌గా ఉంటుంది. ఆలోపు మన కాటేరమ్మ కొడుకులు ఫామ్‌లోకి వచ్చేస్తే.. ఎస్‌ఆర్‌హెచ్‌ నెక్ట్స్‌ లెవెల్‌ టీమ్‌గా మారిపోతుంది. సో.. ఇదంతా జరగాలని కోరుకుందాం.. ఆరెంజ్‌ ఆర్మీ లెట్స్‌ డూ ఇట్‌.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights