IPL 2025: ఐపీఎల్ మధ్యలో ప్రీతిజింటా ప్లేయర్‌కు ఊహించని అదృష్టం.. భారీ గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ

Written by RAJU

Published on:


Shreyas Iyer: అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ భారతదేశంలో జరుగుతోంది. ప్రపంచంలోని స్టార్ ఆటగాళ్లందరూ ఈ లీగ్‌లో ఆడుతున్నారు. ఇదిలా ఉండగా, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ బహుమతిని ఇచ్చింది. గత నెలలో టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడంలో శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు ఈ అద్భుతమైన ప్రదర్శనకు ఐసీసీ అతనికి బహుమతిని ఇచ్చింది.

శ్రేయాస్ అయ్యర్‌కు ఐసీసీ భారీ గిఫ్ట్..

శ్రేయాస్ అయ్యర్ మార్చి 2025కి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీ, రాచిన్ రవీంద్రలను వెనక్కునెట్టేశాడు. భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. టీమిండియా ఆటగాళ్లు వరుసగా రెండోసారి ఈ అవార్డును గెలుచుకుంది. ఫిబ్రవరి ప్రారంభంలో, శుభ్‌మాన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. కాగా, శ్రేయాస్ అయ్యర్ ఈ అవార్డును రెండోసారి గెలుచుకున్నాడు. దీనికి ముందు టీమిండియా నుంచి శుభ్‌మాన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే ఈ అవార్డును రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు.

ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ, ‘మార్చి నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక కావడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. ఈ గౌరవం చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా మేం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న క్షణం అత్యంత అద్భుతమైనది. ఇంత పెద్ద వేదికపై టీమిండియా విజయానికి తోడుగా ఉండడం ప్రతి క్రికెటర్ కల. నాపై అచంచలమైన మద్దతు, నమ్మకానికి నా సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి నేను కృతజ్ఞుడను’ అంటూ చెప్పుకొచ్చాడు.

మార్చి నెలలో పనితీరు ఎలా ఉంది?

మార్చి నెలలో శ్రేయాస్ అయ్యర్ మొత్తం 3 వన్డే మ్యాచ్‌లు ఆడి 57.33 సగటుతో 172 పరుగులు చేశాడు. ఈ కాలంలో, అతను గ్రూప్ ఏ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 79 పరుగులు, సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై 45 పరుగులు, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు చేసి, భారతదేశాన్ని ఛాంపియన్‌గా నిలిపాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights