జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతలో, న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ చేరుకున్నాడు. బుధవారం ( ఏప్రిల్ 24) లాహోర్‌లో అడుగు పెట్టాడు. విలియమ్సన్ PSL 2025లో ఆడటానికి పాకిస్తాన్ వెళ్లాడు. ప్రస్తుత సీజన్ కోసం అతను కరాచీ కింగ్స్‌తో జట్టుతో కలవనున్నాడు. అతను గతంలో IPL 2025 లో వ్యాఖ్యాతగా కనిపించాడు. గతంలో IPL లో అదరగొట్టిన కేన్ మామ ఇప్పుడు పీఎస్‌ఎస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కేన్ విలియమ్సన్ PSL లో అరంగేట్రం చేయనున్నాడు. అతను ఏప్రిల్ 25న క్వెట్టా గ్లాడియేటర్స్‌తో పాకిస్తాన్ లీగ్‌లో తన తొలి మ్యాచ్ ఆడతాడు. కరాచీ కింగ్స్ అతన్ని సప్లిమెంటరీ ప్లేయర్‌గా డ్రాఫ్ట్ చేసింది. నివేదిక ప్రకారం, అతనికి 50 వేల డాలర్లు అంటే రూ.42.70 లక్షలు లభిస్తాయి. ఈ సీజన్‌లో అతను కరాచీ తరపున మొదటి ఐదు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, కరాచీ జట్టు కేన్ విలియమ్సన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అతను ఐపీఎల్‌లో కామెంటరీగా ఉన్నాడు. కాబట్టి అతను సీజన్‌లో సగం వరకు PSLలో కనిపించలేదు. భారతదేశంలో తన ఒప్పందాన్ని పూర్తి చేసిన తర్వాత, అతను ఇప్పుడు ఈ పాకిస్తానీ లీగ్‌లో ఆడనున్నాు. 34 ఏళ్ల విలియమ్సన్ తన పాత సహచరుడు డేవిడ్ వార్నర్‌తో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడనున్నాడు. ఈ సీజన్‌లో కరాచీ జట్టుకు వార్నర్ నాయకత్వం వహిస్తున్నాడు. కేన్ విలియమ్సన్ ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. అతను 2015 నుండి 2024 వరకు 10 సీజన్లు ఆడాడు. 2025 మెగా వేలంలో ఎవరూ అతన్ని కొనుగోలు చేయలేదు. దీంతో అతను కామెంట్రీ చేయాలని నిర్ణయించుకున్నాడు..
ఇవి కూడా చదవండి
పాక్ లో కేన్ విలియమ్సన్..
The most-awaited arrival 😍
Welcome home, Kane Williamson! 💙❤️#YehHaiKarachi | #KingsSquad | #KarachiKings pic.twitter.com/d29sGvluwz
— Karachi Kings (@KarachiKingsARY) April 24, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..