IPL 2025: ఇది విజయం కాదు.. ప్రతీకారం! 18 ఏళ్ల క్రితం రాహుల్‌ ద్రావిడ్‌కు అవమానం.. కసిగా పగ తీర్చుకున్న కోహ్లీ!

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025లో ఫస్ట్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రాండ్‌ విక్టరీ సాధించింది. అది కూడా ప్రత్యర్థి కేకేఆర్‌ హోం గ్రౌండ్‌లో వాళ్లను పూర్తిగా డామినేట్‌ చేస్తూ ఈ సీజన్‌లో ఫస్ట్‌ మ్యాచ్‌ గెలిచి రెండో పాయింట్లు ఖాతాలో వేసుకుంది. పైగా విరాట్‌ కోహ్లీ తన ఫామ్‌ను కంటిన్యూ చేయడం.. లాస్ట్‌ సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్న విరాట్‌.. ఫస్ట్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో దుమ్మురేపి.. ఒక మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆరెంజ్‌ క్యాజ్‌ తనతోనే పెట్టుకున్నాడు. అయితే.. కేకేఆర్‌పై సాధించిన ఈ విజయం ఆర్సీబీకి కేవలం విజయం మాత్రమే కాదు. ఇదో ప్రతీకారం. ఎందుకంటే.. సరిగ్గా 18 ఏళ్ల క్రితం అంటే.. 2008 ఏప్రిల్‌ 18న మొట్టమొదటి ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. అప్పుడు కూడా ఫస్ట్‌ మ్యాచ్‌ ఆర్సీబీ వర్సెస్‌ కేకేఆర్‌ మధ్యే జరిగింది. అప్పుడు ఆర్సీబీకి రాహుల్‌ ద్రావిడ్‌, కేకేఆర్‌కు సౌరవ్‌ గంగూలీలు కెప్టెన్స్‌గా ఉన్నారు.

ఆ మ్యాచ్‌లో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ అనే సునామీలో ఆర్సీబీ కొట్టుకుపోయింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో అతను 158 పరుగులు చేసి జట్టుకు 222 పరుగుల భారీ స్కోర్‌ అందించాడు. ఆ తర్వాత ఆర్సీబీ కేవలం 82 పరుగులకే ఆలౌట్‌ అయి తొలి మ్యాచ్‌లోనే ఘోర అవమానాన్ని చవిచూసింది. ఆ టీమ్‌లో విరాట్‌ కోహ్లీ కూడా ఉన్నాడు. అప్పుడు మనోడు బచ్చా క్రికెటర్‌. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక్క రన్‌ మాత్రమే చేసి దిండా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆర్సీబీ ఫ్రాంచైజ్‌కి, కెప్టెన్‌గా ద్రావిడ్‌కు, యువ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి అది ఓ పీడకల లాంటి మ్యాచ్‌.

ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం మళ్లీ ఇన్నేళ్లకు వచ్చింది ఆర్సీబీ. అప్పుడు ఐపీఎల్‌ మొట్టమొదటి మ్యాచ్‌, ఇప్పుడు కూడా ఈ సీజన్‌లో మొట్టమొదటి మ్యాచ్‌.. అప్పుడు బెంగళూరులో ఆర్సీబీని కేకేఆర్‌ ఓడిస్తే.. ఇప్పుడు కోల్‌కతాలో కేకేఆర్‌ను ఆర్సీబీ ఓడించింది. మధ్య సీజన్స్‌లో కేకేఆర్‌పై గెలిచినా.. సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో గెలవడం స్పెషల్‌. పైగా ఈ 18 ఏళ్లలో ఫస్ట్‌ సీజన్‌ తర్వాత ఇప్పుడే ఈ రెండు టీమ్స్ ప్రారంభ మ్యాచ్‌ ఆడుతున్నాయి. అయితే.. అప్పుడు ఇప్పుడు ఆర్సీబీ టీమ్‌లో విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. అందుకే అప్పటి ఓటమికి ఇప్పుడు కోహ్లీ నాటౌట్‌గా నిలిచి కసిగా ప్రతీకారం తీర్చుకున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification