ABN
, Publish Date – Apr 03 , 2025 | 07:12 AM
ట్రంప్ దెబ్బకి ఆసియా మార్కెట్లు చుక్కలు చూస్తున్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ ఈ ఉదయం గం. 6.30కి ప్రారంభం కాగానే భారీగా 390 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది

Trump
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ దెబ్బకి యూరప్, ఆసియా మార్కెట్లే కాదు అటు, అమెరికా మార్కెట్లు కూడా అతలాకుతలమౌతున్నాయి. అమెరికా విమోచనదినం పేరిట భారత కాలమానం ప్రకారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ట్రంప్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రపంచ దేశాలపై బాంబులు పేల్చారు. చెబుతూ వస్తున్నట్టే ఏ దేశం మీద ఎంత టారిఫ్ విధిస్తోందీ లెక్కలతో సహా ప్రకటించేశారు. దీంతో అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ప్రపంచ మార్కెట్లు కూడా బెంబేలెత్తిపోతున్నాయి. ప్రపంచ దేశాలపై అమెరికా వాణిజ్య యుద్ధ ఫలితాలు క్షణాల్లో కనిపిస్తున్నాయి.
మరోపక్క అమెరికా అధ్యక్షుడు తెరతీసిన వాణిజ్య యుద్ధంపై ప్రతీకారం తీర్చుకుంటానని కెనడా ప్రధాని ప్రతిజ్ఞ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ట్రంప్ దెబ్బకి ఆసియా మార్కెట్లు చుక్కలు చూస్తున్నాయి. జపాన్ లీడింగ్ స్టాక్ ఇండెక్స్ నిక్కీ 3.5% అంటే భారీగా దాదాపు 1135 పాయింట్లు పడిపోయింది. మరో వైపు యూఎస్ స్వంత మార్కెట్ కూడా బాగా ప్రభావితమౌతోంది. యూఎస్ 30 ఇండెక్స్ ఏకంగా 2.16శాతం అంటే 890 పాయింట్లు కోల్పోయి కదలాడుతోంది. నిన్న అమెరికా మిగతా మార్కెట్ ఇండెక్స్‌లైన యూఎస్ టెక్ 100, డౌజోన్స్, ఎస్ అండ్ పి సూచీలు లాభాల్లో ముగిశాయి. ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా గోల్డ్ ప్రైస్ అమాంతం పెరిగిపోతోంది. భారతదేశంపై 26% సుంకాలు విధించనున్నట్టు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోన్న అంశం. మన గిఫ్ట్ నిఫ్టీ ఈ ఉదయం గం. 6.30కి ప్రారంభం కాగానే భారీగా 390 పాయింట్ల నష్టాన్ని చవిచూసి, అనంతరం మెల్లిగా కోలుకుంటూ ఒక దశలో 140 పాయింట్ల నష్టం దగ్గర కదలాడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
For More AP News and Telugu News
Updated Date – Apr 03 , 2025 | 07:46 AM