దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో స్టార్ట్ కాగా.. నిఫ్టీ 24,100 దగ్గర మొదలైంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్ రోజులో ఎగువ స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 1.5% పెరిగి 750 పాయింట్లు పెరిగింది. మిడ్‌క్యాప్ దాదాపు 1.5% పెరిగింది. సెన్సెక్స్ 1,000 పాయింట్లు పెరిగి 80,200 దాటింది.
ఈ క్రమంలో ప్రస్తుతం రిలయన్స్, భారత్ ఎలక్ట్రిక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, శ్రీరామ్ ఫైనాన్స్, HCL టెక్, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఈ రికార్డు పెరుగుదల అనేక ఆర్థిక సూచికలు, షేర్ బాజార్లలో ప్రగతిని సూచిస్తూ, ప్రముఖ రంగాలలో వృద్ధిని చూపిస్తోంది. నికర లాభాలు, పలు కీలక రంగాలలో పాజిటివ్ పనితీరుతో, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్టర్ల మధ్య నమ్మకం కూడా పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి