భారత సాయుధ దళాలలో మహిళల ప్రాతినిధ్యం పెంచడంలో అవని చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్‌లు విప్లవాత్మకమైన ముందడుగు వేశారని చెప్పవచ్చు. స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ భారతదేశంలోని స్వదేశీ ‘మేడ్ ఇన్ ఇండియా’ LCA తేజస్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను నిర్వహిస్తున్న ఎలైట్ 18 ‘ఫ్లయింగ్ బుల్లెట్స్’ స్క్వాడ్రన్‌లో చేరిన మొదటి మహిళా ఫైటర్ పైలట్ అయ్యారు. స్క్వాడ్రన్ లీడర్లు భావనా కాంత్, అవని చతుర్వేది ప్రస్తుతం Su-30 MKI ఫైటర్ జెట్‌లను నడుపుతున్నారు. 2016లో, అవని చతుర్వేది, భావన కాంత్‌లతో కలిసి మోహనా సింగ్, భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించిన మొదటి మహిళలు. వీరి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి.

International Women’s Day: ఈ ముగ్గురు దేశాన్ని రక్షించే ఆడ సింహాలు.. భారత తొలి ఫైటర్ పైలట్లు వీరే! ఉమెన్స్ డే స్పెషల్
Written by RAJU
Published on: