- హైకోర్టు సంచలన తీర్పు
- వివాహితులిద్దరూ సంబంధం పెట్టుకోవడం నేరం కాదు

ఇద్దరు వివాహితులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇరువురికి వైవాహిక స్థితి గురించి తెలిశాక.. సమ్మతితో సెక్స్ సంబంధం పెట్టుకోవడం ఏ మాత్రం నేరం కాదని పేర్కొంది. ఏకాభిప్రాయంగా పరిగణించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Prithviraj Sukumaran : మూడు ఇండస్ట్రీలను మడతెట్టేస్తున్న ‘వరద’
ఇద్దరు వివాహితులు రెండేళ్ల నుంచి శారీరిక సంబంధం కలిగి ఉన్నారు. విషయం తెలుసుకున్న మహిళ భర్త.. ఆమెతో జీవించడానికి నిరాకరించాడు. దీంతో తనతో సంబంధం ఉన్న మహిళను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆమె సెప్టెంబర్ 8, 2024న మేనాగురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్లు 69 (మోసపూరిత మార్గాల ద్వారా లైంగిక సంబంధం) మరియు 351(2) (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. ఇక విచారణ సందర్భంగా ఆ వ్యక్తిపై కేసు విచారణను రద్దు చేశారు.
ఇది కూడా చదవండి: Heat Stroke: రాష్ట్ర విపత్తుగా వడదెబ్బ.. మరణిస్తే 4 లక్షల ఎక్స్‌గ్రేషియా..!