ABN
, Publish Date – Apr 24 , 2025 | 04:00 AM
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు మే 22 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3 నుండి 6 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): వచ్చేనెల 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2-30 నుంచి 5-30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. మే-22న ద్వితీయ భాష, 23న ఇంగ్లీష్, 24న గణితం పేపర్-ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్, 25న మ్యాథమెటిక్స్ పేపర్-బి, జువాలజీ, హిస్టరీ, 26న ఫిజిక్స్, ఎకనామిక్స్, 27న కెమిస్ర్టీ, కామర్స్, 28న పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్, బ్రిడ్జి కోర్సు గణితశాస్త్రం, 29న మాడ్రన్ ల్యాంగ్వేజ్, జియాగ్రఫీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్-11న ఉదయం 10 నుంచి 1వరకు, ఎతిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జూన్ 12న ఉంటుందన్నారు.
Updated Date – Apr 24 , 2025 | 04:00 AM