ABN
, Publish Date – Apr 10 , 2025 | 05:17 AM
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బీసీ కులాల్లోని నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీసీ కమిషన్ సూచించింది.
సంచార జాతులు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నట్టు గుర్తించి, వారికి ఇళ్లు, ఉపాధి కల్పించాలని తీర్మానించింది.

తెలంగాణ బీసీ కమిషన్ సమావేశంలో తీర్మానం
ఇందిరమ్మ ఇళ్ళ మంజూరులో బీసీ కులాల్లో నిరుపేదలకు ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ బీసీ కమిషన్ తీర్మానించింది. గతనెలలో బీసీ కమిషన్ బృందం వేములవాడ, జగిత్యాల, సిరిసిల్ల, ఆమన్‌గల్, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సంచార జాతుల పరిస్థితులను అధ్యయనం చేసి, వారు ఎంతో దయనీయ పరిస్థితిలో ఉన్నట్లు గుర్తించిందని కమిషన్ చైర్మన్ నిరంజన్ బుధవారం జరిగిన కమిషన్ సమావేశంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంచార జాతులకు చెందిన వారికి ఇళ్ళు, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకే వారికి ఇళ్ల కేటాయింపు, ఆర్ధిక సాయం అందించే పథకాల్లో ప్రాధాన్యం కల్పించాలని తీర్మానం చేశామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..
Updated Date – Apr 10 , 2025 | 05:17 AM