ఫ్లైట్‌లో ప్రయాణికుడు మరణించడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఒక ప్రయాణీకుడు మరణించాడు. అస్సాం నివాసి అయిన సతీష్ అనే ప్రయాణీకుడు తన భార్యతో కలిసి చికిత్స కోసం ఢిల్లీ వెళ్తున్నాడు. ఇండిగో విమానం శనివారం పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరింది.
అయితే ఫ్లైట్ గాల్లో ఉండగా విమానంలోనే అతడు మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు.. దీంతో విమానాన్ని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మృతదేహాన్ని విమానం నుండి దించి పోస్ట్ మార్టం నిమిత్తం KGMU కి తరలించారు. విమానంలో మృతుడిగో పాటుగా అతని భార్య, బావమరిది కూడా ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..