దేశ దిశ

India’s technique to forestall Pakistan from getting water from the Indus River..

India’s technique to forestall Pakistan from getting water from the Indus River..

  • సింధు నది నీరు ఒక్క చుక్క దక్కకుండా భారత్ వ్యూహం..
  • పాకిస్తాన్ తడి ఆరిపోవడం ఖాయం..
  • ఆనకట్టల ఎత్తు పెంచేందుకు భారత్ కసరత్తు..
India’s technique to forestall Pakistan from getting water from the Indus River..

Indus water: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్‌కి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు, దాని ఉపనదులు నుంచి ఒక్క చుక్క నీరు దక్కకుండా భారత్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఇది ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించింది. సింధు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నిర్ణయాన్ని భారత్, పాక్ ప్రభుత్వానికి అందించింది.

Read Also: Hafiz Saeed: ‘‘మోడీ మీ శ్వాస ఆపేస్తాం’’.. ఉగ్రవాది హఫీజ్ సయీద్ వార్నింగ్.. వీడియో వైరల్..

సింధు నదీ జలాలు పాక్‌కి అందకుండా మూడు దశల ప్రణాళికను భారత్ సిద్ధం చేసింది. సింధు పరివాహక నదుల వెంట ఉన్న ఆనకట్టల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడంతో, ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్ స్వేచ్ఛగా డ్యాములు, ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు.

ఈ మేరకు నిర్ణయం అమలుపై అమిత్ షా కీలక సమావేశాన్ని శుక్రవారం నిర్వహిచారు. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. మొదట ప్రపంచ బ్యాంక్కు మన వైఖరి తెలియజేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం.. తూర్పు నదులైన సట్లెజ్, బియాస్ మరియు రావిలను భారతదేశానికి మరియు పశ్చిమ నదులైన సింధు, జీలం మరియు చీనాబ్‌లను పాకిస్తాన్‌కు కేటాయిస్తుంది. ఈ ఒప్పందంలో పాకిస్తాన్ ఎక్కువగా లాభపడుతోంది. సింధు జలాల పాక్‌కి వెళ్లకుంటే పంజాబ్, సింధ్ ప్రావిన్సులు ఎడారిగా మారుతాయి.

Exit mobile version