దేశ దిశ

Indian Tigers & Tigresses: న్యూఢిల్లీలో భారత ఫుట్‌బాల్ ప్లేయర్లను స్వాగతించిన ఆస్ట్రియా ఎంబసీ..

Indian Tigers & Tigresses: న్యూఢిల్లీలో భారత ఫుట్‌బాల్ ప్లేయర్లను స్వాగతించిన ఆస్ట్రియా ఎంబసీ..


Indian Tigers & Tigresses: ఆస్ట్రియాలోని గ్ముండెన్‌లో వారం రోజుల ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ శిక్షణను పూర్తి చేసుకుని భారత దేశానికి తిరిగి వచ్చిన 28 మంది యువ క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. టీవీ9 ప్రత్యేక చొరవతో “ఇండియన్ టైగర్స్ & టైగ్రెస్స్” టాలెంట్ హంట్ ప్రోగ్రాంను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎంపికైన 28 మంది ప్రతిభావంతులైన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు వారం రోజుల పాటు ఆస్ట్రియాలో ప్రత్యేక శిక్షణ అందించారు. ఈమేరకు న్యూఢిల్లీలోని ఆస్ట్రియా రాయబారి కూడా ఈ యువ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికింది. ఆస్ట్రియన్ రాయబారి కార్యాలయంలో యువ అథ్లెట్ల కోసం ప్రత్యేక స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు.

కాగా, ఈ టాలెంట్ హంట్ కార్యక్రమం కోసం దాదాపు 50,000 మందికి పైగా దరఖాస్తుదారులు చేసుకున్నారు. ఇందులో 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల 28 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. మార్చి 28న జరిగిన ‘టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే (విట్) సమ్మిట్ 2025′ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువ ఆటగాళ్లకు వ్యక్తిగతంగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి వచ్చిన యువ ఆటగాళ్లకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని, అలాగే వారికి అత్యున్నత స్థాయి శిక్షణ అందించామని ఆస్ట్రియన్ రాయబార కార్యాలయం పత్రికా ప్రకటన తెలిపింది.

గ్ముండెన్‌లో శిక్షణా శిబిరంలో ఆస్ట్రియన్ దిగ్గజం గెర్హార్డ్ రీడ్ల్, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్ ఫర్ టెక్నికల్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ & ఎడ్యుకేషన్ (IFC) అధ్యక్షుడు, RIESPO CEO కృషితోనే ఇది సాధ్యమైంది. ఈ కార్యక్రమం ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ శిక్షణ ప్రమాణాలను పెంచడంతోపాటు భారతదేశంలో ముఖ్యంగా బాలికలలో ఉద్భవిస్తున్న ఫుట్‌బాల్ ప్రతిభను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

భారతదేశంలోని ఆస్ట్రియా రాయబారి హెచ్‌ఈ కాథరినా వైజర్ స్వాగత కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈ యువ భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు కొత్త నైపుణ్యాలతోపాటు విశ్వాసం, అంతర్జాతీయ గుర్తింపుతో ఆస్ట్రియా నుంచి తిరిగి రావడం ఆనందంగా ఉంది. యువ భారతీయ ప్రతిభకు ద్వారాలు తెరవడంతో, ఆస్ట్రియా, భారతదేశం మధ్య సంబంధాలను మరింత బలడనున్నాయి. టీవీ9 ఇండియన్ టైగర్స్ & టైగ్రెస్స్’ వంటి కార్యక్రమాన్ని యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవాలని” సూచించారు.

“నా కల భారత జట్టు ఏదో ఒక రోజు ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలవడమే. భారతదేశంలో ప్రతిభ ఉందని నేను నమ్ముతున్నాను. దానిని గుర్తించడం, ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెంచడం చాలా ముఖ్యం. ఆస్ట్రియాకు చెందిన IFC & రీస్పోతో సహా మా ప్రపంచ భాగస్వాముల మద్దతుతో TV9 నెట్‌వర్క్ మరింత ముందడుగు వేసేందుకు కట్టుబడి ఉంది” అని టీవీ9 నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో బరుణ్ దాస్ అన్నారు.

ఈ 28 మంది ఆటగాళ్లలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో అధునాతన శిక్షణ పొందారు. ఇది వారి భవిష్యత్ కెరీర్‌లను అన్వేషించడానికి మరిన్ని అవకాశాలను అందించడంలో కీలకంగా మారనుంది. ఈ సహకారం భారత్, ఆస్ట్రియా మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version