భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రకరకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. జనరల్ టికెట్స్ కాకుండా సీటు కన్ఫర్మ్ కోసం ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో ప్రయాణికులు తనకు నచ్చిన సీటును బుక్ చేసుకుంటారు. అయితే అది కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అనేది తర్వాత విషయం. సీటు లభ్యత, రైల్వే నిబంధనలను బట్టి సీట్లను కేటాయిస్తారు రైల్వే అధికారులు.
చాలా మంది లోయర్ బెర్త్ కోసం ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, ఇతర సమస్యలలో బాధపడుతున్న వాళ్లకు లోయర్ బెర్త్ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లోయర్ బెర్త్ పొందే అవకాశాలు ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: iPhone 16: ఒక్క రూపాయి కట్టకుండానే ఐఫోన్ 16.. అది కూడా డిస్కౌంట్‌లో.. షరతులు వర్తిస్తాయ్!
ఇవి కూడా చదవండి
సీట్ల లభ్యత ఆదారంగా..
అయితే ప్రయాణికులు టికెట్స్ బుకింగ్ సమయంలో తమకు నచ్చిన బెర్త్‌ను ఎంచుకునే ఆప్షన్‌ను రైల్వే ఇస్తుంది. అయితే టికెట్ బుకింగ్ సమయంలో బెర్త్ ప్రిఫరెన్స్ విభాగంలో లోయర్ బెర్త్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లోయర్ బెర్త్‌ను బుక్ చేసుకున్నంత తప్పకుండా కన్ఫర్మ్ అవుతుందని ఉండదు. సీట్ల లభ్యత ఆధారంగా ఉంటుందని గుర్తించుకోవాలి.
సీనియర్ సిటిజన్ కోటాలో లోయర్ బెర్త్:
ఇక సీనియర్ సిటిజన్ కోటా కింద లోయర్‌బెర్త్ లభించే అవకాశాలు ఉంటాయి. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు సీనియర్ సిటిజన్ కోటాలో లోయర్ బెర్త్ ను పొందే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని లోయర్ బెర్త్‌లు మాత్రం ఒంటరిగా ప్రయాణించే మహిళలకు లేదంటే 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్రయాణించే మహిళలకు రిజర్వ్ చేసి ఉంటాయి. ఈ కోటా ఎక్కువగా స్లీపర్ క్లాస్, థర్డ్ ACకి వర్తిస్తుంది. రైల్వే రిజర్వేషన్ టికెట్స్ 60 రోజుల ముందుగానే మొదలవుతుంది. మీరు వీలైనంత ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే లోయన్ బెర్త్ అందే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, స్లీపర్ క్లాస్ (SL), థర్డ్ AC (3AC)తో పోలిస్తే సెకండ్ AC (2AC), ఫస్ట్ AC (1AC)లలో బుక్ చేసుకునే ప్రయాణికులకు లోయర్ బెర్త్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తించుకోండి.
TTEతో మాట్లాడి బెర్త్ మార్చుకోండి
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మీరు బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ పొందలేకపోతే మీరు బోర్డింగ్ తర్వాత రైలు టికెట్ ఎగ్జామినర్ (TTE)ను అడిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చివరి ప్రయాణం నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి వారి లోయర్ బెర్త్ అందుబాటులోకి వస్తే అప్పుడు మీరు టీటీఈని కలిసి ఆ సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Smart TV Lifespan: స్మార్ట్ టీవీకి గడువు తేదీ ఉంటుందా? దాని జీవిత కాలం ఎంత?