Indian Railways: ట్రైన్‌లో వెళ్లే వారికి డబ్బులే డబ్బులు! క్యాష్‌ కష్టాలకు చెక్‌ పెట్టిన ఇండియన్‌ రైల్వేస్‌

Written by RAJU

Published on:

నాసిక్‌లోని మన్మాడ్, ముంబై మధ్య నడుస్తున్న పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే శాఖ అధికారులు ఏటీఎంను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటి సారి ట్రైన్‌లో ఏటీఎటిఎంను మంగళవారం విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇగత్‌పురి, కసారా ​​మధ్య నెట్‌వర్క్ లేని ప్రాంతంలో రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఏటీఎం మిషన్‌ కొన్ని సార్లు సిగ్నల్ కోల్పోయిందని, అది తప్ప ఈ ఏటీఎం సక్సెస్‌ఫుల్‌గా పనిచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. “ఫలితాలు బాగున్నాయి. ప్రజలు రైలులో నగదు తీసుకోగలరు. మేం ఏటీఎం పనితీరును పర్యవేక్షిస్తూనే ఉంటాం” అని భూసావల్ డీఆర్‌ఎం ఇతి పాండే పేర్కొన్నారు.

రైల్వే భూసావల్ డివిజన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల సహకారంతో ఈ ఏటిఎం ఏర్పాటు చేశారు. రైలులోని 22 కోచ్‌లు వెస్టిబ్యూల్స్ ద్వారా అనుసంధానించబడి ఉన్నందున ట్రైన్‌లో ఏ కోచ్‌లో ఉన్న వారైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. పంచవటి ఎక్స్‌ప్రెస్ రేక్ 12071 ముంబై-హింగోలి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో లింకై ఉన్నందున మన్మాడ్-నాసిక్ మార్గం దాటి హింగోలికి సుదూర ప్రయాణీకులకు కూడా ఈ ఏటీఎం అందుబాటులో ఉంటుంది. రెండు రైళ్లు మూడు రేక్‌లను పంచుకుంటాయి. ఆన్-బోర్డ్ ఏటీఎంకు ప్రజల స్పందనను బట్టి దీనిని ఇతర ప్రధాన రైళ్లకు కూడా విస్తరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. అదే జరిగితే.. రైలులో ప్రయాణిస్తూనే మనకు అవసరాల కోసం స్టేషన్‌లో దిగే ముందే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights