Indian Railway: భారతదేశంలోని ఏకైక శాఖాహార రైలు.. ఇక్కడ ప్యూర్ వెజ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది..

Written by RAJU

Published on:

భారతదేశంలో రైలు ప్రయాణం ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఆ అనుభవాన్ని మరింతగా పెంచేది అక్కడ అందుబాటులో లభించే ఆహారం..రైలు ప్రయాణం అనేది రద్దీగా ఉండే స్టేషన్ల నుండి స్థానిక విక్రేతలు, IRCTC నిర్వహించే పాంట్రీ సేవల వరకు ఒక ప్రత్యేక ప్రయాణం. రైలు ప్రయాణ సమయంలో చాలా మంది ప్రయాణికులకు అక్కడ వడ్డించే ఆహారం నచ్చదు. రైళ్లలో వడ్డించే ఆహారం ఆరోగ్యకరమైనది కాదని భావిస్తున్నారు. ఆహారం తయారుచేసేటప్పుడు సరైన పరిశుభ్రత పాటించడం లేదని, శాఖాహారం, మాంసాహార వంటకాలను విడివిడిగా వండరని ప్రయాణికులు అంటుంటారు. కానీ ఒక రైలు తన ప్రయాణీకులకు శాఖాహార ఆహారాన్ని మాత్రమే అందిస్తుంది. అది ఏ రైలు, దాని వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

కేవలం శాఖాహారం మాత్రమే సప్లై చేస్తున్న మొదటి రైలు ఇది. ఢిల్లీ నుండి జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రా వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కేవలం శాఖాహార భోజనాన్ని మాత్రమే అందిస్తుంది. భారతదేశం మెనూలో కేవలం శాఖాహారం మాత్రమే ఉన్న మొదటి రైలు ఇది. ఢిల్లీ-కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా శాఖాహార రైలు. ప్రయాణీకులకు శాఖాహార భోజనాన్ని మాత్రమే అందిస్తోంది. ఇందులో పూర్తిగా శాఖాహార వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయాణీకులు సైతం రైలులో ఎలాంటి మాంసాహారం, లేదా చిరుతిళ్లు తీసుకెళ్లడం కూడా నిషేధించబడింది. ఈ రైలులో దూర ప్రయాణాలు చేసే ప్రయాణీకులకు శాఖాహార భోజనం మాత్రమే వడ్డిస్తారు. మాంసం, గుడ్లు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు.

భారత రైల్వే అథారిటీ IRCTC, భారతదేశానికి చెందిన NGO సాత్విక్ మండేలా మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా సాత్విక్ సర్టిఫికేట్ పొందిన ఏకైక రైలు ఢిల్లీ-కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది న్యూఢిల్లీ (NDLS), శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (SVDK) మధ్య నడిచే సెమీ-హై-స్పీడ్ రైలు.

ఇవి కూడా చదవండి

శాఖాహార అనుకూల ప్రయాణాన్ని ప్రోత్సహించడమే IRCTC లక్ష్యం:

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సాత్విక్-సర్టిఫైడ్” కొన్ని రైళ్ల ద్వారా శాఖాహార-స్నేహపూర్వక ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది. మతపరమైన ప్రదేశాలను అనుసంధానించే మార్గాల్లో నడిచే రైళ్లను సాత్విక ఆహారాన్ని అందించే రైళ్లుగా మార్చారు. ఇండియన్ సాత్విక్ కౌన్సిల్ 2021లో IRCTCతో కలిసి సాత్విక్ సర్టిఫికేషన్ పథకాన్ని ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Subscribe for notification