- కెనడాలో భారతీయుడు హత్య
- నిందితుడు అరెస్ట్.. హత్యకు కారణాలు చెప్పని పోలీసులు

కెనడాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కెనడాలోని ఒట్టావాలో భారతీయుడిని దుండగుడు కత్తితో పొడిచి చంపినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: NTR : ఎన్టీఆర్.. నెల్సన్.. వేరే లెవల్ వర్మ
ఒట్టావాలో భారతీయుడు కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరం అని భారత ఎంబసీ తెలిపింది. ఈ ఘటనలో అనుమానితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పింది. ఈ విచారకర పరిస్థితుల్లో మృతుడి సన్నిహితులు, కుటుంబసభ్యులకు అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చింది. స్థానిక కమ్యూనిటీతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ఎంబసీ వెల్లడించింది. అయితే మృతుడి వివరాలు మాత్రం వెల్లడించలేదు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కెనడా మీడియా తెలిపింది. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు చేపట్టామని స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Hyderabad : డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్స్ అరెస్ట్..