India strongly refutes Pakistan’s allegations

Written by RAJU

Published on:

  • రైలు హైజాక్ పై పాక్ తీవ్ర ఆరోపణలు
  • పాక్ ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పిందించింది
  • ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు
India strongly refutes Pakistan’s allegations

పాకిస్తాన్ లో గత కొన్ని రోజుల క్రితం రైలు హైజాక్ అయిన విషయం తెలిసిందే. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణిస్తుండగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. అయితే ఈ ఘటనపై తమ దేశంలో జరుగుతున్న హింసకు భారతదేశమే కారణమని పాకిస్తాన్ ఆరోపించింది. పాక్ మరోసారి భారత్ పై విషం చిమ్మింది. పాక్ ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పిందించింది. పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Also Read:Ponnam Prabhakar: జగదీష్ రెడ్డి చేసింది తప్పు.. స్పీకర్ను విమర్శించడం బీఆర్ఎస్కి మంచిది కాదు

పాకిస్తాన్ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని భారతదేశం పేర్కొంది. పాకిస్తాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులపై వేలెత్తి చూపించడానికి బదులుగా తనను తాను చూసుకోవాలని చురకలంటించింది. కొన్ని రోజుల క్రితం బలూచిస్తాన్‌లో హైజాక్ చేయబడిన బందీలందరినీ రక్షించినట్లు పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. అయితే, బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సైన్యం వాదనను తోసిపుచ్చారు. వారి వద్ద ఇంకా 150 మందికి పైగా బందీలు ఉన్నారని చెప్పారు.

Subscribe for notification