Pakistan May Drop From Asia Cup 2025: పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. పాకిస్తాన్ క్రికెటర్లు భారతదేశానికి వ్యతిరేకంగా బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇలా ప్రకటనల వల్ల కలిగే పరిణామాలను పాకిస్తాన్ అనుభవించాల్సి రావొచ్చని తెలుస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. ఇప్పుడు బీసీసీఐ పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఆతిథ్యం భారతదేశం చేతిలో ఉంది. 2026 టీ20 ప్రపంచ కప్‌నకు ముందు ఈ ముఖ్యమైన టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టును మినహాయించవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వాదనను భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ వినిపించారు.
పాకిస్తాన్ పై చర్యలు తీసుకుంటాం: బీసీసీఐ
పహల్గామ్ దాడి తర్వాత చాలా విషయాలు మారిపోయాయని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ ఆసియా కప్‌లో పాల్గొనడం ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తోంది. ఆయన ప్రకారం, బీసీసీఐ ఎల్లప్పుడూ భారత ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తుంది. ఇది ఆసియా కప్‌లో కూడా కనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
“భారత ప్రభుత్వం ఏమి చేయమని అడుగుతుందో అది చేయడమే బీసీసీఐ వైఖరి. కాబట్టి, ఆసియా కప్ విషయంలో ఇందులో ఎటువంటి మార్పు ఉండదని నేను అనుకుంటున్నాను. ఈ ఆసియా కప్‌ను భారత్, శ్రీలంక నిర్వహిస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ఆసియా కప్‌లో భాగం కావడం లేదని నేను భావిస్తున్నాను” అని గవాస్కర్ అన్నారు. అయితే, రాబోయే రెండు నెలల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఏసీసీ రద్దు కావొచ్చు..
సునీల్ గవాస్కర్ ప్రకారం, పాకిస్తాన్‌ను మినహాయించడానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)ని కూడా రద్దు చేయవచ్చు. అంటే, దీని అర్థం ఏసీసీ భవిష్యత్తు కూడా ప్రమాదంలో ఉండనుంది. పరిస్థితి మెరుగుపడకపోతే, అది ఉనికిలో లేకుండా పోతుంది. ఆసియా కప్‌నకు బదులుగా, కేవలం 3 లేదా 4 దేశాల మధ్య మాత్రమే టోర్నమెంట్ ఆడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ మినహాయింపు గురించి ఆయన మాట్లాడుతూ, “అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. బహుశా ఏసీసీ రద్దు కావొచ్చు. లేదా మూడు దేశాలతో ఆడొచ్చు. అది మూడు దేశాల టోర్నమెంట్ కావచ్చు లేదా హాంకాంగ్ లేదా UAEలను ఆహ్వానించగల నాలుగు దేశాల టోర్నమెంట్ కావొచ్చు. కానీ, అది రాబోయే కొన్ని నెలల్లో ఏమి జరుగుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన అన్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..