IND vs NZ Pitch Update: ఫైనల్ మ్యాచ్‌ ఎలాంటి పిచ్‌పై జరుగుతుంది? బయటికొచ్చిన కీలక సమాచారం

Written by RAJU

Published on:


India Pakistan Pitch for Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతను మార్చి 9న నిర్ణయించనున్నారు. ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో ఎవరూ భారత్‌ను ఓడించలేకపోయారు. సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో, న్యూజిలాండ్ జట్టు గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌పై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అది గ్రూప్ ఏలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే, సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన విజయంతో, కివీస్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ కీలక మ్యాచ్ ఎలాంటి పిచ్‌పై జరుగుతుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది.

ఏ పిచ్ వాడుతున్నారంటే?

పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్‌లో, భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో హైబ్రిడ్ మోడల్ కింద ఆడుతోంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పిచ్ గురించి ఇప్పుడు కీలక సమాచారం బయటకు వచ్చింది. నిజానికి, ఈ పిచ్‌ భారత జట్టు ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల మాదిరిగా కొత్తగా ఉండవు. కానీ, ‘సెమీ-ఫ్రెష్’గా ఉంటుంది

తుది పిచ్‌పై కీలక అప్‌డేట్..

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, రెండు వారాల క్రితం ఫిబ్రవరి 23న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌కు ఉపయోగించిన అదే పిచ్‌పై ఫైనల్ నిర్వహించనున్నారు. ఆ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు, ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌లకు(ఇండియా vs బంగ్లాదేశ్, ఇండియా vs పాకిస్తాన్, ఇండియా vs న్యూజిలాండ్) నాలుగు వేర్వేరు పిచ్‌లను ఉపయోగించారు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ ఇంతకు ముందు ఉపయోగించనిది కాదు. అయితే, దానిపై చివరి వన్డే ఆడినప్పటి నుంచి 14 రోజులు అయ్యింది. దీంతో పిచ్‌కు తగినంత సమయం ఇచ్చారంట. ఈ పిచ్ సెమీ-ఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం, స్టేడియంలో 10 పిచ్‌లు ఉన్నాయి. వాటిలో నాలుగు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి

పిచ్ చాలావరకు నెమ్మదిగానే..

ఈ మైదానంలోని వికెట్లను దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నియంత్రించే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) సిద్ధం చేస్తోంది. ఇక్కడ సర్ఫేస్ క్యూరేటర్ ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ సాండరీ, ఇతను ICC అకాడమీ పిచ్‌లను కూడా చూసుకుంటాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పిచ్‌లు చాలావరకు నెమ్మదిగా, పొడిగా ఉన్నాయి. స్పిన్నర్లకు కొంతవరకు సహాయపడతాయి. ఫైనల్‌కు కూడా వికెట్ అలాగే ఉంటుందని తెలుస్తోంది.

ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్-న్యూజిలాండ్ రికార్డులు..

ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. బ్లాక్‌క్యాప్స్ మెన్ ఇన్ బ్లూపై 3-1 ఆధిక్యంలో ఉంది. వారి మ్యాచ్‌లలో 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019, 2023 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉన్నాయి. భారత జట్టు సాధించిన ఏకైక విజయం 2023 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో వచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification