IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీం వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో తెలుసా.. అసలు కారణం ఇదే?

Written by RAJU

Published on:


Team India: నిన్న ఆదివారం అంటే, 9 మార్చి 2025న టీం ఇండియా కొత్త చరిత్రను లిఖించింది. క్రికెట్ ప్రపంచంలో, అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న జట్టుగా భారత జట్టు నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆ తర్వాత మొత్తం జట్టు మరోసారి తెల్లటి బ్లేజర్లు ధరించి సంబరాలు చేసుకుంటూ కనిపించింది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా టీం ఇండియా ఇదే విధంగా సంబురాలు చేసుకుంది. ఛాంపియన్ జట్టు తెల్లటి బ్లేజర్ ఎందుకు ధరిస్తుందో మీకు తెలుసా?

తెల్లటి బ్లేజర్ ఎందుకు ధరిస్తారు?

ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత టీం ఇండియాకు పతకాలు, వైట్ బ్లేజర్లు ప్రదానం చేశారు. తెల్లటి బ్లేజర్లు ధరించి, ఆటగాళ్లందరూ విజయాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, ప్రశ్న ఏమిటంటే టీం ఇండియాను తెల్లటి బ్లేజర్ ధరించమని ఎందుకు కోరారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది దక్షిణాఫ్రికాలో జరిగిన 2009 ఎడిషన్‌లో తొలిసారిగా ప్రారంభమైంది. ఛాంపియన్లను సత్కరించే విజయానికి బ్లేజర్ పవర్ ఫుల్ చిహ్నంగా అవతరించింది. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే జట్టుకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తుంటారు.

రోహిత్ కెప్టెన్సీ అద్భుతం..

రోహిత్ శర్మ కెప్టెన్సీకి మరో ట్రోఫీ దక్కింది. 10 నెలల క్రితం, టీం ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో, టీం ఇండియా ట్రోఫీని తృటిలో చేజార్చుకుంది. కానీ, ఇప్పుడు రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు టీం ఇండియా తదుపరి లక్ష్యం 2027 వన్డే ప్రపంచ కప్ అనడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

భారత్ ప్రదర్శన..

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గట్టి పోటీ నెలకొంది. టాస్ గెలిచిన కివీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. భారీ స్కోరు ఆశిస్తున్న కివీస్ జట్టుకు భారత స్పిన్నర్లు అడ్డుకున్నారు. జడేజా, కుల్దీప్, చక్రవర్తి కలిసి 5 వికెట్లు తీసి దెబ్బకొట్టారు. అనంతరం రోహిత్ శర్మ 76 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీం ఇండియా విజయానికి పునాది వేశాడు. చివరికి, భారత్ 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification