India vs New Zealand Final: ఆదివారం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు తమ సన్నాహాలను ఇప్పటికే పూర్తి చేశాయి. అయితే, ఈ మ్యాచ్ కోసం బెట్టింగ్‌లు ఓ రేంజ్‌లో నడుతుస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కోట్లల్లో పందాలే వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ బుకీలలో ఇండియా ఫేవరెట్ జట్టుగా అవతరించిందని తెలుస్తోంది. ఆదివారం దుబాయ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌పై దాదాపు రూ.5,000 కోట్ల విలువైన పందాలు జరిగినట్లు సమాచారం.
ఈ బుకీలలో చాలా మంది అండర్ వరల్డ్ తో సంబంధం కలిగి ఉన్నారని, హై ప్రొఫైల్ క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో దుబాయ్ కేంద్రంగా ప్రధాన బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దావూద్ ఇబ్రహీం ముఠా ‘డి కంపెనీ’ కూడా ఇందులో ఉందంట. ఇది దుబాయ్ క్రికెట్ బెట్టింగ్ రంగంలో బలమైన వాటాను కలిగి ఉందని చెబుతున్నారు.
బెట్టింగ్ సిండికేట్లపై కఠిన చర్యలు..
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఐదుగురు కీలక బుకీలను అరెస్టు చేసింది. దీంతో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ వేయడంలో వారి ప్రమేయం బయటపడింది. వీరిని విచారణ చేస్తున్న క్రమంలో దుబాయ్ వరకు లింక్ ఉందని తెలిసింది. అక్కడ పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తుందంట. ఇంతకుముందు ఇండియా-ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్‌పై బెట్టింగ్ వేస్తుండగా పర్వీన్ కొచ్చర్, సంజయ్ కుమార్ అనే ఇద్దరు బుకీలతోపాటు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర బెట్టింగ్ సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
పర్వీన్ కొచ్చర్ లక్కీ.కామ్ అనే బెట్టింగ్ వెబ్‌సైట్ నుంచి మాస్టర్ ఐడిని కొనుగోలు చేసి, దాని ద్వారా బెట్టింగ్ ఐడీలను సృష్టించి విక్రయించినట్లు తెలిసింది. ప్రతి లావాదేవీపై 3% కమీషన్ వసూలు చేసిందంట. ఆఫ్‌లైన్ బెట్టింగ్ కోసం లావాదేవీలను ఫోన్ కాల్స్ ద్వారా నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ ఆపరేషన్‌ను సులభతరం చేయడానికి, కొచ్చర్ నెలకు రూ. 35,000కి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, రెండేళ్లుగా బెట్టింగ్ వ్యాపారాన్ని నడుపుతూ, మ్యాచ్ రోజులలో రోజుకు రూ.40,000 లాభం పొందుతున్నాడంట. విచారణ సమయంలో, మొత్తం ఆపరేషన్ దుబాయ్ నుంచి నడిపించినట్లు అంగీకరించాడు.
బెట్టింగ్ రాకెట్‌లో కీలక వ్యక్తులు..
చోటూ బన్సాల్: పశ్చిమ ఢిల్లీ నివాసి, ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నాడు. అతను కెనడాలో ఒక బెట్టింగ్ యాప్‌ను అభివృద్ధి చేశాడు. ఇతరులు బెట్టింగ్ వేసేందుకు అద్దెలు తీసుకుంటుంటారు.
వినయ్: ఢిల్లీలోని మోతీ నగర్ నివాసి, దుబాయ్ లోనే ఉన్నాడు. అతను క్రికెట్ మైదానం నుంచి నేరుగా రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ అందించాడు.
అలాగే, ఢిల్లీకి చెందిన బాబీ, గోలు, నితిన్ జైన్, జితు ఈ సిండికేట్‌లో భాగమని నివేదికలు వచ్చాయి.
ఢిల్లీ నుంచి అరెస్టయిన వారిలో మనీష్ సహాని, యోగేష్ కుకేజా, సూరజ్ ఉన్నారు. వీరందరికీ దుబాయ్‌తో సంబంధాలు ఉన్నాయి. వారి నుంచి పోలీసులు రూ.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
బెట్టింగ్ వేసే వ్యక్తుల కాల్స్‌ను రికార్డ్ చేయడం, బ్యాంకు ఖాతాలు లేదా నగదు ద్వారా లావాదేవీలను నిర్వహించడం వంటి బాధ్యతలను మనీష్ సహానీ నిర్వహిస్తుంటాడని తెలిసింది. అతను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మొత్తం ఆపరేషన్‌ను స్వతంత్రంగా నిర్వహించాడంట.
బెట్టింగ్ యాప్‌లకు అంతర్జాతీయ లింక్‌లు..
విచారణ సమయంలో, మన్ను మట్కా, అక్షయ్ గెహ్లాట్, నిషు, రింకు, అమన్ రాజ్‌పుత్‌లతో సహా విదేశీ గ్రూప్ భారతదేశం వెలుపల సత్తా బెట్టింగ్ యాప్‌ను అభివృద్ధి చేసిందని, ఇది ప్రపంచ బెట్టింగ్ సిండికేట్‌ను మరింత బలోపేతం చేసిందని నిందితులు వెల్లడించారు.
దుబాయ్ అక్రమ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలకు కేంద్రంగా కొనసాగుతున్నందున, అధికారులు ఈ ఆపరేషన్ ఎంతవరకు విస్తరించి ఉందనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..