దేశ దిశ

In IPL 2025 season Shubman Gill Leads evaluate to Shreyas Iyer

In IPL 2025 season Shubman Gill Leads evaluate to Shreyas Iyer


In IPL 2025 season Shubman Gill Leads evaluate to Shreyas Iyer

IPL 2025: తొలి సీజన్లోనే ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ గతేడాది లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ, ఈ సీజన్ లో మాత్రం ఆ జట్టు అసాధార ప్రదర్శనతో అదరగొడుతుంది. శుభ్ మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ సమిష్టిగా రాణిస్తూ ప్లేఆప్స్ రేసులో నిలిచింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచుల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించడంలో కెప్టెన్ గిల్ విజయం సాధించాడు. ఈ సీజన్లో అద్భుత ఫామ్ తో రాణించిన గిల్.. రెండు భారీ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా.. అంతకుముందు మ్యాచ్ లో కేకేఆర్ పై 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేరువలో అవుటైన గిల్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ కెప్టెన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో మొత్తంగా 9 మ్యాచ్‌ల్లో 156 స్ట్రైక్ రేట్ తో 389 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.

Read Also: Pahalgam terror Attack: ‘‘ఎగ్జిట్ గేట్ వద్ద కాల్పులు, ఎంట్రీ గేట్‌ వైపు టూరిస్టుల పరుగులు’’.. వెలుగులోకి ఉగ్రవాదుల కుట్ర..

ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్ గా నిలిచాడు. అయ్యర్ 9 మ్యాచ్‌ల్లో మూడు అర్ద సెంచరీల సహాయంతో మొత్తం 288 పరుగులు చేశాడు. అంటే.. శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మధ్య 100 పరుగుల వ్యత్యాసం ఉంది. కాగా, గుజరాత్‌కు అతిపెద్ద బలం ఆ జట్టు టాప్ ఆర్డర్. సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్, జోస్ బట్లర్ ఇలా ఎవరో ఒకరు పరుగుల వరద పారిస్తూ.. జట్టు బాధ్యతను తీసుకుంటున్నారు.

Read Also: Hyderabad: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం

అయితే, పంజాబ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేయకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. అయితే, అయ్యర్ నాయకత్వంకు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ 9 మ్యాచుల్లో 5 గెలిచి 11 పాయింట్లతో టాప్ ఫైవ్ లో ఉంది. మొత్తం సీజన్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ 456 పరుగులతో టేబుల్ టాప్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానములో విరాట్ కోహ్లీ 443 పరుగులతో ఉన్నాడు. చూడాలిమరి! గత సీజన్ లో కప్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ మరోసారి కప్ అందుకుంటాడో.. లేక గిల్ అందుకుంటాడో.

Exit mobile version