ఇంటర్నెట్ డెస్క్: మానవ సమాజాన్ని ప్రస్తుతం భయపెడుతున్న అత్యంత భయానక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.ఇక క్యాన్సర్‌కు చికిత్సగా కిమోథెరపీ కొన్ని దశాబ్దాలుగా ఎందరో రోగుల ప్రాణాలు కాపాడింది. అయితే, ఆధునిక సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గతదశాబ్ద కాలంలో ఇమ్యునోథెరపీ క్యాన్సర్ చికిత్సగా మంచి ప్రాచుర్యం పొందుతోందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కిమోథెరపీ బదులు ఇమ్యూనోథెరపీనే వాడుతున్నారట (Health).
Hormonal Balance: శరీరంలో హార్మోన్‌ల సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు పాటించాల్సిన పద్ధతులు!
ఎమిటీ ఇమ్యూనోథెరపీ..
మన రోగనిరోధక వ్యవస్థకు సహజంగానే క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే శక్తి ఉంటుంది. ఈ సామర్థ్యం ఆధారంగానే ఇమ్యునోథెరపీ రూపుదిద్దుకుంది. ఇమ్యూనోథెరపీకి సంబంధించి మోనాక్లోనల్ యాంటీబాడీస్, సింథటిక్ యాంటీబాడీస్ క్యాన్సర్ చికిత్సలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. వీటిని ప్రయోగశాలలో సిద్ధం చేస్తారు. ఇవి క్యాన్సర్ కణాల్లోని కీలక ప్రొటీన్ల పనితీరుకు ఆటంకాలు సృష్టి్స్తాయి. తద్వారా క్యాన్సర్ కణాలను మన రోగ నిరోధక వ్యవస్థ సులువుగా గుర్తించేలా చేస్తాయి. మిగతా పని రోగ నిరోధక శక్తి చక్కబెట్టేస్తుంది. దీంతో, క్యాన్సర్ నుంచి విముక్తి లభిస్తుంది. సైటోకైన్ థెరపీ కూడా క్యాన్సర్‌కు చికిత్సగా ప్రాచుర్యం పొందుతోందని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీ సెల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా సైటోకైన్స్ ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా, క్యాన్సర్ కణాల విభజనను కూడా అడ్డుకుని వాటి వ్యాప్తికి బ్రేకులు వేస్తాయి.
చెక్‌పాయింట్ ఇన్‌హిబిటర్ చికిత్సలో కూడా గొప్ప అభివృద్ధి చోటుచేసుకుంటోంది. రోగనిరోధక వ్యవస్థలోని కణాలు క్యాన్సర్ కణాలపై దాడి చేయకుండా అడ్డుకొనే కొన్ని ప్రొటీన్లను ఈ ఇన్‌హిబిటర్లు నిర్వీర్యం చేస్తాయి. దీంతో, రోగ నిరోధక వ్యవస్థ నిరాటంకంగా క్యాన్సర్ కణాల పని పడుతుంది.
ఆంకాలజీ మరింతగా అభివృద్ధి చెందే కొద్దీ క్యా్న్సర్ చికిత్సలతో పాటు నివారణా విధానాలపై కూడా ఫోకస్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ కణాలకు సూచికలుగా ఉండే ప్రొటీన్లను ముందుగానే గుర్తించి నాశనం చేసే టీకాలపై ప్రస్తుతం పరిశోధన పెద్ద ఎత్తున జరుగుతోందని చెబుతున్నారు.
Read Latest and Health News