బిజినెస్ న్యూస్: పసిడి రేట్లు (Gold prices) చూస్తుండంగానే దిగి వచ్చాయి. గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లు తగ్గుతూనే వస్తున్నాయి. దీంతో పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి ఛాన్స్. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ పోయింది. బంగారం ధరలపై గ్లోబల్ మార్కెట్ల (Global bullion market) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు రూ. 700 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అందుకే గోల్డ్ ధరలు స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. ఇక్కడి నుంచి బంగారం ధర రూ. లక్ష దిశగా దూసుకువెళుతున్న సమయంలో ఆగింది.
Also Read..: రుణగ్రహీతలకు ఊరట
తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము రూ. 8,291 కాగా 10 గ్రాముల ధర రూ. 82,910గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ. 9,045 కాగా 10 గ్రాముల ధర రూ. 90,450గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ. 6,784 కాగా 10 గ్రాముల ధర రూ. 67,840గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24, 18 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
కోల్‌కతా- రూ. 82,910, రూ.90,450, రూ. 67,840
చెన్నై- రూ. 82,910, రూ.90,450, రూ. 68,360
బెంగళూరు- రూ. 82,910, రూ.90,450, రూ. 67,840
పుణె- రూ. 82,910, రూ.90,450, రూ. 67,840
అహ్మదాబాద్- రూ. 82,280, రూ. 90,500, రూ. 67,320
భోపాల్- రూ. 82,960, రూ.90,500, రూ. 67,880
కోయంబత్తూర్- రూ. 82,910, రూ.90,450, రూ. 68,360
పట్నా- రూ. 82,960, రూ.90,500, రూ. 67,880
సూరత్- రూ. 82,280, రూ. 90,500, రూ. 67,320
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెంది. ఇది ఆభరణాలు, నాణేలు, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈ మధ్య వివాహ వేడుకల్లో కూడా బంగారం తర్వాత వెండికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వెండి కొనేముందు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. దేశంలోని వివిధ నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 1,01,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి రూ. 92,900గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.92,900 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,01,900గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,01,900 వద్ద కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి ధరలు మారుతుంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నేవీ అమ్ములపొదిలో రాఫెల్ ఫైటర్లు
రాష్ట్రానికి కేంద్రం వరాలు
For More AP News and Telugu News
Updated Date – Apr 10 , 2025 | 07:20 AM