IIM Graduate Job Resigned in 10 Days After Realizing Role Involves Sales Instead of Marketing

Written by RAJU

Published on:

  • సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్.
  • ఉద్యోగంలో చేరిన 10 రోజుల్లోనే రూ.21లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన ఐఐఎమ్ గ్రాడ్యుయేట్.
  • ఇన్ సైడ్ మార్కెటింగ్ కోసమని చెప్పి సేల్స్ చేయమన్నారని ఉద్యోగానికి రాజీనామా.
IIM Graduate Job Resigned in 10 Days After Realizing Role Involves Sales Instead of Marketing

Job Resignation: ప్రస్తుత కాలంలో ఉద్యోగం సంపాదించడమే చాలా కష్టంగా ఉంది. ఇక తీరా ఉద్యోగం సంపాదించిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఇకపోతే ప్రస్తుతం ఉద్యోగులు తమ ఉద్యోగ కష్టాలు కార్యాలయ అనుభవాలు, కార్యాలయ సమస్యలను పంచుకోవడానికి సోషల్ మీడియా వేదికగా మారింది. ఉద్యోగులు తమ కథలను పంచుకోవడానికి, అలాగే సలహా తీసుకోవడానికి ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సొసైల్ మీడియా అండగా నిలుస్తోంది.

Read Also: Ranya Rao: ప్రోటోకాల్ ఉల్లంఘన, రన్యారావు తండ్రి పాత్రపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

ఇకపోతే తాజాగా ఒక రెడ్డిట్ వినియోగదారుడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) గ్రాడ్యుయేట్ ఓ ప్రముఖ కంపెనీలో చేరిన 10 రోజుల్లోనే రాజీనామా చేసిన ఒక కథను పంచుకున్నారు. ఇందులో అతను గతంలో ఇన్‌సైడ్ సేల్స్ ప్రతినిధిగా ఉన్నప్పుడు, కొత్తగా నియమించబడిన ఓ ఐఐఎం గ్రాడ్యుయేట్‌కు ఖాతా ఎగ్జిక్యూటివ్ శిక్షణ ఇవ్వమని అడిగినట్లు పేర్కొన్నాడు. కొత్తగా నియమించబడిన వ్యక్తికి సంవత్సరానికి రూ. 21 లక్షల జీతం ప్యాకేజీతో పాటు మరో రూ. 2 లక్షల జాయినింగ్ బోనస్‌ను ఆఫర్ చేసినట్లు తెలిపాడు. అయితే, అధిక జీతం ఉన్నప్పటికీ ఆ ట్రైనీ రెండు వారాలలోపు కంపెనీని విడిచిపెట్టాడని అతను పేర్కొన్నాడు.

Read Also: Kiran Abbavaram : ఆ సినిమా చూడలేక థియేటర్ నుండి వెళ్లిపోయాను

అయితే, ఎందుకు ఉద్యోగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని అడిగినప్పుడు.. కొత్తగా వచ్చిన ఆ ఉద్యోగి తాను మార్కెటింగ్ విభాగంలో పని చేస్తానని అనుకున్నాని, కానీ, ఒక సంవత్సరం పాటు అమ్మకాలు చేయమని చెప్పినట్లు తెలిపాడు. ఆ అవకాశం పట్ల అతఫు అసంతృప్తిగా ఉండడంతో అతను ఉద్యోగంలో చేరిన 10 రోజుల్లోనే ఉద్యోగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్నీ తాను అతనిని అడిగినప్పుడు, నన్ను మార్కెటింగ్ కోసం తీసుకున్నారని, ఇప్పుడు నన్ను ఒక సంవత్సరం పాటు సేల్స్ చేయమని చెప్పారని.. అలాగే బయట మార్కెట్ ఇలాగే ఉంటుందా? అని ప్రశ్నించినట్లు తెలిపారు.

Funny incident of an IIM grad
byu/Suspicious-Air1997 inIndianWorkplace

Subscribe for notification