- పాకిస్తాన్‌కి అందనంత ఎత్తులో భారత సైనిక సామర్థ్యాలు..
- ఏ దశలో కూడా భారత్‌కి పోటీఇచ్చే స్థితిలో లేని దాయాది..
- అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న పాకిస్తాన్..

India-Pak War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లష్కరేతోయిబా అనుబంధం ఉగ్ర సంస్థ చేసిన దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్ నుంచి కుట్ర జరిగినట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం కోరుతోంది.
ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇరు దేశాల బలాబలాలు, ఏ దేశం ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన సైన్యాలను లిస్ట్ చేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ -2025 ప్రకారం, చూస్తే అన్ని విభాగాల్లో పాకిస్తాన్‌కి అంతనంత ఎత్తులో భారత్ ఉంది.
ఏ దేశం ఎటువైపు:
ఒక వేళ యుద్ధం వస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో గ్లోబల్ సూపర్ పవర్స్ అయిన అమెరికా, రష్యాలు భారత్‌కి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపాయి. ఇక ఇజ్రాయిల్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు మద్దతు ప్రకటించాయి. చాలా వరకు యూరోపియన్ యూనియన్, అరబ్ దేశాలు కూడా భారత్‌కి మద్దతుగా నిలుస్తాయి.
పాకిస్తాన్ విషయానికి వస్తే అరబ్ లీగ్‌లో ఒకటి రెండు దేశాలు మినహా ఆ దేశానికి పెద్దగా మద్దతు లేదు. టర్కీ, అజర్ బైజాన్, మలేషియా వంటి దేశాలు పాకిస్తాన్‌కి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అయితే, పాక్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా ఈ ఘర్షణలో, ఇప్పుడున్న స్థితిలో భారత్‌కి పూర్తి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. చైనా కొద్ది మేరకు పాకిస్తాన్‌కి సాయపడే అవకాశం ఉంది.
ర్యాంక్: భారత్-4, పాకిస్తాన్ -12
రక్షణ బడ్జెట్:
భారతదేశం యొక్క రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ కంటే $75 బిలియన్లతో, ప్రపంచంలోనే 4వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో, పాకిస్తాన్ రక్షణ బడ్జెట్‌లో 38వ స్థానంలో ఉంది. పాక్ రక్షణ బడ్జెట్ 7.64 బిలియన్లు. భారతదేశం రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ.
ఇండియా vs పాకిస్తాన్ సైనిక బలం:
సైనికుల పరంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. 14,55,550 మంది క్రియాశీల సిబ్బందితో. అదనంగా, భారతదేశం 11,55,000 మంది సైనికుల రిజర్వ్ ఫోర్స్‌ను కలిగి ఉంది.
పాకిస్తాన్ సైన్యం 6,54,000 మంది సైనికులను కలిగి ఉంది. భారతదేశంలో 25,27,000 పారామిలిటరీ దళాలు ఉండగా, పాకిస్తాన్ వద్ద 5,00,000 పారామిలిటరీ దళాలు ఉన్నాయి.
భారతదేశం వద్ద 4,201 ట్యాంకులు ఉండగా, పాకిస్తాన్ వద్ద 2,627 ఉన్నాయి. ఇండియా వద్ద T-90 భీష్మ మరియు అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులు మరియు పినాకా రాకెట్ వ్యవస్థ వంటి అధునాతన వ్యవస్థలను కూడా కలిగి ఉంది.
భారతదేశం 148,594 సాయుధ వాహనాలను కలిగి ఉంది. పాకిస్తాన్ 17,516 యూనిట్లను కలిగి ఉంది. అయితే, పాకిస్తాన్ వద్ద 662 యూనిట్ల సెల్ఫ్-ప్రొపెల్లడ్ ఆర్టిలీ యూనిట్లు ఉంటే, భారత్ వద్ద 100 యూనిట్ల మాత్రమే ఉన్నాయి.
ఇండియా vs పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ బలం:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్:
మొత్తం 2229 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి.
* 600 ఫైటర్ జెట్స్
* 831 సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్
* 899 హెలికాప్టర్స్
రాఫెల్, మిరాజ్ 2000, మిగ్ -29, సుఖోయ్ Su-30MKI యుద్ధ విమానాలను కలిగి ఉంది.
ఇండియన్ మిస్సైల్ సిస్టమ్స్:
* బ్రహ్మోస్(సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్)
* రుద్రమ్(యాంటి రేడియేటెడ్ మిస్సైల్)
* అస్త్ర( ఎయిర్-టూ-ఎయిర్ మిస్సైల్)
* నిర్భయ్( సబ్ సోనిక్ క్రూజ్ మిస్సైల్)
* ఆకాష్( సర్ఫేజ్ టూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్)
పాక్ ఎయిర్ ఫోర్స్:
మొత్తం 1,434 విమానాలు ఉన్నాయి,
* 387 ఫైటర్ జెట్‌లు
* 60 రవాణా విమానాలు
* 549 శిక్షణా విమానాలు
* 352 హెలికాప్టర్లు
* 57 అటాక్ హెలికాప్టర్లు
* 4 వైమానిక ట్యాంకర్లు(గాలిలో ఇంధనం నింపుకోవడానికి)
పాకిస్తాన్ వద్ద సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు లేవు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేదు.
ఇండియా VS పాకిస్తాన్ నేవీ పవర్:
ఇండియా నేవీ పవర్:
* 1,42,251 నావికా సిబ్బంది
* సుమారు 150 యుద్ధనౌకలు
* 18 అణు జలాంతర్గాములు
* 14 ఫ్రిగేట్స్
*18 కార్వెట్టెస్
* 135 పెట్రోలింగ్ నౌకలు.
2 విమాన వాహక నౌకలు:
INS విక్రమాదిత్య
INS విక్రాంత్
ఈ భారీ వాహక నౌకలు యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను, క్షిపణులను దానిపై నుంచి ప్రయోగించగలవు.
పాక్ నేవీ:
* 114 నావికా నౌకలు
* 8 జలాంతర్గాములు
* 9 యుద్ధనౌకలు (యుద్ధనౌకలు)
పాకిస్తాన్ నేవీ, భారత్‌లో ఏ దశలోనూ పోటీ పడే స్థాయిలో లేదు.