- హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్ దాడి
- హమాస్‌కు చెందిన కీలక నేతలు హతం

హమాస్ అంతమే లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులకు తెగబడింది. గత వారం జరిపిన దాడుల్లో వందలాది మంది చనిపోగా.. మరోసారి ఆదివారం కూడా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులకు తెగబడ్డాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు హతమయ్యారు. మరోవైపు నాజర్ ఆస్పత్రి మృతులు, క్షతగాత్రులతో నిండిపోయింది.
ఇది కూడా చదవండి: Exclusive : స్పిరిట్ లో ప్రభాస్ తో పాటు తమిళ స్టార్ హీరో
దక్షిణ గాజాలో నాజర్ ఆసుపత్రి అతిపెద్దది. ఇందులో ఉగ్రవాదులు తిట్టవేస్తారన్న పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. వైమానిక దాడుల నేపథ్యంలో అత్యవసర విభాగంలో మంటలు చెలరేగాయి. హమాస్ అగ్ర నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ మరణాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వైమానిక దాడులతో ఖాన్ యూనిస్‌లోని ఆసుపత్రి సర్జికల్ భవనంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించిందని, అనేక మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడులను హమాస్ కూడా ధృవీకరించింది. ఇక ఈ దాడులను ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. ఆస్పత్రి నుంచి పని చేస్తున్న హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా ఈ దాడులను చేసినట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Canada: ట్రంప్ బెదిరింపులు.. ముందస్తు ఎన్నికలకు కెనడా ప్రధాని పిలుపు
ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. అయితే ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చల నేపథ్యంలో ఖైదీ-బందీల మార్పిడి ఒప్పందం జరిగింది. ఇరుపక్షాలు ఖైదీ-బందీలను విడుదల చేశారు. అయితే ఈ ఒప్పందం ఇటీవల ముగిసింది. ఈ ఒప్పందాన్నే కొనసాగించాలని ఇజ్రాయెల్ పట్టుబట్టింది. అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో మరోసారి యుద్ధానికి ఇజ్రాయెల్ శ్రీకారం చుట్టింది. గత వారం జరిపిన దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా ఐడీఎఫ్ చేసిన దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేతలు, వారి భార్యలు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Manchu Vishnu : నా భార్య నన్ను రెండో పెళ్లి చేసుకోమంది..