IDBI Bank : డిగ్రీ అర్హతతో 650 పోస్టులు.. ఏడాదికి రూ 6.50 లక్షల వరకు జీతం

Written by RAJU

Published on:

IDBI Bank Junior Assistant Manager Recruitment 2025 : ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకెళ్తే..

హైలైట్:

  • ఐడీబీఐ బ్యాంక్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ 2025
  • 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ ఖాళీల భర్తీ
  • మార్చి 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • మార్చి 12 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయం

Samayam Teluguఐడీబీఐ బ్యాంక్‌ ఉద్యోగ ప్రకటన
ఐడీబీఐ బ్యాంక్‌ ఉద్యోగ ప్రకటన

IDBI Bank Junior Assistant Manager Recruitment 2025 : ఐడీబీఐ బ్యాంక్‌ భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ ఖాళీల భర్తీ (యూఆర్‌- 260, ఎస్సీ- 100, ఎస్టీ- 54, ఈడబ్ల్యూఎస్‌- 65, ఓబీసీ- 171, పీడబ్ల్యూడీ- 26)కి సమాయత్తమవుతోంది. ఈ పోస్టులకు డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల నియామకాలు ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (PGDBF) కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. మణిపాల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్ – బెంగళూరులో పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు పూర్తి చేయాలి. ఏడాది కోర్సులో 6 నెలల క్లాస్ రూమ్‌ ట్రైనింగ్‌, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలు ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. అందులో విజయవంతమైన వారిని విధుల్లోకి తీసుకుంటారు. కోర్సు శిక్షణ సమయంలో ప్రతి నెలా స్టైపెండ్‌ అందుతుంది. ఉద్యోగంలో చేరిన తరువాత ఏడాదికి రూ.6.5 లక్షల వేతనం అందజేస్తారు. ఇక అభ్యర్థులు మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 12 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అప్లయ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. ఇతర బ్యాంక్‌ ఉద్యోగాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు – 650
  • అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయోపరిమితి: మార్చి 1, 2025 నాటికి 20 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • జీతం – స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.5,000, ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్‌ ఉంటుంది. అలాగే.. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ6.50 వరకు వేతనం ఉంటుంది.

అలాగే..

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది.
  • పరీక్షా కేంద్రాలు: ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, పట్న తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
  • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: మార్చి 1, 2025
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు, ఫీజు చెల్లింపునకు చివరి తేది: మార్చి 12, 2025
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 6, 2025
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification