
ఎండాకాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఐటెం ఏదైనా ఉందంటే అది ఐస్ క్రీమే. మండే ఎండల్లో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. కానీ ఓ కప్పు ఐస్ క్రీం లాగించేస్తే మాత్రం నోట్లో టేస్ట్ బర్డ్స్ సాటిస్ఫై అవ్వడంతో పాటు పొట్టలో చల్లగా ఉంటుంది. చాలా పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఐస్ క్రీం లేనిదే జరగని పరిస్థితి. ఇలాంటి వేడుకల్లో చాలా మంది మిగిలిన ఐటెమ్స్ తో పాటు ఈ హిమక్రీములను కూడా లాగించేస్తుంటారు. అయితే, ఐస్ క్రీం తిన్న తర్వాత కొన్ని తప్పులు చేస్తే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎలాంటి తప్పులు చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని అనేది మనం తెలుసుకుందాం.
1. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఐస్క్రీం వల్ల కాదు..
చాలా మంది ఐస్ క్రీం తిన్న వెంటనే జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. ఇదంతా ఐస్ క్రీం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అనుకుంటారు. కానీ నిజానికి అసలు కారణం ఇది కాదు. దీన్ని తిన్న వెంటనే వెంటనే నీళ్లు తాగడం వల్ల ఇలా జరుగుతుంది.
2. వెంటనే ఇవి తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత వేడి ఆహారాలు తినకూడదు. చల్లని ఐస్ క్రీం తిన్న తర్వాత వెంటనే వేడి ఆహారం తినడం వల్ల జీర్ణ సమస్యలు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
3. సిట్రస్ పండ్లు తినడం:
పాలు, సిట్రస్ పండ్లను ఎట్టిపరిస్థితుల్లో కలిపి తినకూడదు. పాలలో ఉండే లాక్టోస్, ఈ పండ్లలో ఉండే సిట్రస్ కలిస్తే అది వెంటనే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
4. పెరుగు తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత వెంటనే పెరుగు తినకూడదు. ఐస్ క్రీంలోని పాలు, పెరుగు కలిసి జీర్ణ సమస్యలు కలిగిస్తాయి.
5. టీ లేదా కాఫీ తాగడం:
ఐస్ క్రీం తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగకూడదు. టీ/కాఫీలో ఉండే కెఫిన్ ఐస్ క్రీంలోని పాలు, పెరుగుతో కలిసి జీర్ణ సమస్యలు కలిగిస్తుంది.
6. వేడి సూప్ తాగడం:
ఐస్ క్రీం తిన్న తర్వాత వెంటనే వేడి సూప్ తాగకూడదు. ఐస్ క్రీం తిన్న తర్వాత వేడి సూప్ తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.
ఐస్ క్రీం తిన్న తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోండి:
* ఐస్ క్రీం తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు నీళ్లు, వేడి ఆహారాలు, సిట్రస్ పండ్లు, పెరుగు, టీ/కాఫీ, వేడి సూప్ తాగకండి.
* ఐస్ క్రీం తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగండి.
* ఐస్ క్రీం తిన్న తర్వాత ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్త వహించండి.
ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఐస్ క్రీం తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించవచ్చు.