Hyperlink Roads: ప్రజావసరాలకు అనుగుణంగా లింక్‌ రోడ్లు

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 30 , 2025 | 01:32 AM

హైదరాబాద్‌ నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్‌) రోడ్ల నిర్మాణం చేపట్టా ్టలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

Link Roads: ప్రజావసరాలకు అనుగుణంగా లింక్‌ రోడ్లు

  • రోడ్ల విస్తరణ, కొత్త రోడ్లను నిర్మించాలి

  • అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్‌) రోడ్ల నిర్మాణం చేపట్టా ్టలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో హైదరాబాద్‌ రోడ్డు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై సమీకృత పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, అవాంతరాలు లేకుండా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.అనుసంధాన రహదారుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మందుకెళ్లాలని సూచించారు. ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి ప్రయాణ సమయం కలిసి వచ్చేలా ఉండాలని, ఈ క్రమంలో అదనపు భూేసకరణకు కొంత అధిక వ్యయమైనా వెనుకాడవద్దని స్పష్టం చేశారు.

Updated Date – Mar 30 , 2025 | 01:33 AM

Google News

Subscribe for notification
Verified by MonsterInsights