HYDRA:హైడ్రాపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు | TG High court Sensational comments on HYDRA VVNP

Written by RAJU

Published on:

హైదరాబాద్, మార్చి 19: హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది.పేద, మధ్య తరగతి వారే మీ టార్గెటా? అని హైడ్రా‌ను హైకోర్టు నిలదీసింది. ఈ రాష్ట్రంలో ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా ? అంటూ సందేహం వ్యక్తం చేసింది. మియాపూర్, దుర్గం చెరువు ఆక్రమణల పరిస్థితి ఏమిటంటూ హైడ్రాను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థతక అని స్పష్టం చేసింది. హైడ్రా పని తీను అంత ఆశాజనకంగా లేదని ఉన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే

‘మీరాలం’పై ఉమ్మడి సర్వే చేపట్టాలని హైడ్రాను ఆదేశించింది. అక్రమ నిర్మాణంలో మీ నివాసం ఉందని.. దీనిని కూల్చివేయాల్సి ఉదంటూ ఫాతిమా అనే మహిళకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సదరు మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైడ్రాపై హైకోర్టు ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

2023 ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం మూసి పరివాహక ప్రాంతంతోపాటు పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి అధిపతిగా ఏవీ రంగనాథ్‌ను నియమించింది. అయితే హైడ్రా కూల్చివేతలపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అదీకాక సంపన్న వర్గాలకు చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చడం లేదని.. కేవలం పేద, మధ్యతరగతి వారి నివాసాలనే కూల్చివేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ.. హైకోర్టు సైతం అదే తరహాలో స్పష్టం చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

Nara Lokesh: ధన దాహంతో పారిశ్రామిక వేత్తలను ఇబ్బంది పెట్టారు

Good News For AP People: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

KGBV: కేజీవీబీ ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటి నుంచంటే..

Central Cabinet Meeting : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Reduce Obesity Tips: ఊబకాయాన్ని తగ్గించుకోనేందుకు.. జస్ట్ ఈ చిట్కాలు..

Summer Tips: వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి.. అదిరిపోద్ది

For Telangana News And Telugu News

Updated Date – Mar 19 , 2025 | 09:51 PM

Subscribe for notification