ABN
, Publish Date – Apr 18 , 2025 | 05:11 AM
బెట్టింగ్ యాప్‌లో నష్టపోయిన యువకుడు మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఫోన్, బుల్లెట్ బైక్ కోల్పోయి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

రాజేంద్రనగర్, ఏప్రిల్17(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ యాప్‌నకు ఓ యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నాననే మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల్‌కు చెందిన పెద్ద నర్సింహులు కుమారుడు పవన్(25) మాసబ్‌ట్యాంక్‌లోని కళాశాలలో ఎంటెక్ చేస్తున్నాడు. స్నేహితులు ఎన్.గౌతమ్, రోహిత్‌లతో కలసి అత్తాపూర్ రెడ్డి బస్తీలో ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోవడంతో తండ్రికి ఫోన్ చేసి బాధపడ్డాడు. బెట్టింగ్‌లో ఐ ఫోన్ 15, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను కూడా పోగొట్టుకున్నాడని తెలిపాడు. భయపడవద్దని ధైర్యం చెప్పిన తండ్రి పలుమార్లు రూ.98,200లను పంపించాడు. అయినా మనస్తాపంతో బుధవారం అద్దె ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఈ విషయాన్ని పక్క ఇంట్లో ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తి తండ్రి పెద్ద నర్సింహులుకు ఫోన్ చేసి చెప్పాడు.
Updated Date – Apr 18 , 2025 | 05:11 AM