hyderabad physician preethi reddy saves passenger life with cpr in indigo flight at 39,000 toes

Written by RAJU

Published on:

  • విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడికి అస్వస్థత
  • సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మల్లారెడ్డి కోడలు
  • ప్రశంసలు కురిపించిన సహచర ప్రయాణికులు, సిబ్బంది
hyderabad physician preethi reddy saves passenger life with cpr in indigo flight at 39,000 toes

వైద్యులు.. దేవుడితో సమానం అంటారు. దేవుడు మనిషిని చేస్తే.. వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టేది డాక్టర్లు. అందుకే రోగులు.. వైద్యులకు దండాలు పెడతారు. దేవుడితో సమానంగా చూస్తారు కాబట్టే.. అంతగా వారిని గౌరవిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఇండిగో విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. విమానం 39 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ఇంతలో ఒక వృద్ధ ప్రయాణికుడు (74) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మూర్ఛపోయి.. నోట్లో నుంచి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అదే విమానంలో తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు.. డాక్టర్ ప్రీతి రెడ్డి ప్రయాణిస్తున్నారు. విషయం గమనించిన ఆమె.. వెంటనే బాధితుడి దగ్గరకు వెళ్లి పరీక్షింపగా.. బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి సీపీఆర్ చేశారు. వెంటనే వృద్ధుడు తేరుకున్నాడు. ఆరోగ్యం వెంటనే కుదిటపడింది. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇక డాక్టర్ ప్రీతి రెడ్డి చేసిన తెగువకు సహచర ప్రయాణికులు, సిబ్బంది ప్రశంసించారు. ఇక విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే ఎయిర్‌పోర్టు సిబ్బంది వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. గత శనివారం అర్ధరాత్రి
ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రీతిరెడ్డి… మల్లారెడ్డి విద్యా సంస్థల ద్వారా వైద్య విద్యా రంగంలో చేసిన సేవలకు గాను ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుతో సత్కరించబడ్డారు. ప్రీతి రెడ్డి ప్రస్తుతం మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. వైద్య విద్యారంగంలో మంచి ఆరోగ్యం అందించడంలో ఆమె తనదైన ముద్రను వేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights