Hyderabad MMTS Prepare In Sexual Harassment At Younger Girl

Written by RAJU

Published on:

  • హైదరాబాద్: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం..
  • యువతిపై అత్యాచారానికి యత్నించిన దుండగుడు..
  • కదులుతున్న రైల్లో నుంచి ఒక్కసారిగా దూకిన యువతి..
  • యువతికి తీవ్ర గాయాలు, గాంధీ ఆస్పత్రికి తరలింపు..
  • సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్‌లో ఘటన
Hyderabad MMTS Prepare In Sexual Harassment At Younger Girl

Hyderabad MMTS: సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్న ఘటన కలకలం రేపుతుంది. రైలు బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నించడంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి దూకిన యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read Also: Hanamkonda: ముస్లిం అమ్మాయితో మాట్లాడిన హిందూ యువకుడిపై దాడి..

కాగా, హస్టల్ లో ఉంటూ ప్రైవేట్ గా పని చేస్తున్న ఓ యువతి(23) అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందినది. ఈ నెల 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఆమె సెల్ ఫోన్ రిఫేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చి ఎంఎంటీఎస్ లో మేడ్చల్ కు ఉమెన్స్ కోచ్ లో బయలుదేరింది. అప్పటికే ఆ బోగీలలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మహిళాలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. తర్వాత ఆ కోచ్ లో ఆమె ఒక్కతే ఒంటరిగా ఉండగా ఓ యువకుడు (25) బోగీలోని ఆమె దగ్గరకు వచ్చి నువ్వు కావాలంటూ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకొని అత్యాచారయత్నానికి ట్రై చేశాడు. ఇక, అతడి నుంచి తప్పంచుకునే ప్రయత్నంలో ఆమె కదులుతున్న రైలు నుంచి బయటకు దూకేసింది. కోంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో.. అక్కడికి చేరుకున్న సిబ్బంది ముందుగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం యువతిని డిశ్చార్జ్ చేసిన వైద్యులు.. బాధితురాలి దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Hyderabad MMTS Train women Incident : హైదరాబాద్ MMTSలో యువతి పై అ*త్యాచారయత్నం | Special Report|Ntv

Subscribe for notification