మార్చి 22 న హైదరాబాద్‌లో MMTS ట్రైన్‌లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ యువతి రైల్లో నుంచి దూకేసింది. ప్రాణాలతో పోరాడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందింది. ఈ ఘటనపై రాజకీయ నేతలు సైతం స్పందించారు. అసలు భద్రత ఏదని ప్రశ్నించారు. కేంద్రమంత్రులూ దిగివచ్చారు. పరామర్శించారు. నీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఇంతకీ ఆ కేసు ఏమైంది. నిందితుడు దొరికాడా. ఈ ఘటనపై అదిరిపోయే అప్‌డేట్ మీకోసం..
ఎంఎంటీఎస్ రైలు.. ఫోను రిపేరు కోసం మెదక్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి.. ఫోన్ రిపేరు చేయించుకొని ఎంఎంటీఎస్ రైల్లో తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో తనతోపాటు ఆబోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఇతర స్టేషన్లలో దిగిపోగా.. ఒంటరిగా ఉన్న ఈ యువతి దగ్గరకు వచ్చిన ఓ యువకుడు తనపై అత్యాచారానికి ప్రయత్నిస్తే తప్పించుకునే క్రమంలో రైల్లోనుంచి దూకేసింది. ఈ క్రమంలో గాయాలపాలైన యువతిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఇది ఆ యువతి అల్లిన కథ. ఇదే నిజమనుకొని ఏకంగా 250 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు.. 100 మంది అనుమానితులను విచారించారు.. ఎక్కడా ఎలాంటి ఆధారం దొరకలేదు. దాంతో అయోమయంలో మడ్డ పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఆ యువతిని కాస్త గట్టిగా విచారించే సరికి .. ఇన్‌స్టా రీల్స్ చేస్తూ జారిపడ్డానని అసలు కథ చెప్పింది. దెబ్బకు షాకయ్యారు పోలీసులు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.