- హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం..
- 20 నిమిషాల పాటు ఆగిపోయిన మెట్రో..
- మియాపూర్ టూ ఎల్బీ నగర్ మార్గంలో ఆగిన మెట్రో ట్రైన్స్..

Hyderabad Metro: హైదరాబాద్ నగరంలోని మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ట్రైన్ ఆగిపోయింది. దాదాపుగా 20 నిమిషాల పాటు భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రైలు నిలిచిపోయింది. దీంతో ట్రైన్ లో అసౌకర్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంకేతక సమస్యల కారణంగానే మెట్రో రైలు నిలిపోయినట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం నెమ్మదిగా మళ్లీ మొదలైన మెట్రో ట్రైన్స్.. పదే పదే మెట్రో సంకేతిక సమస్యలతో ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.