మెట్రో రెండో దశ ప్రాజెక్టు నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌లో కొనసాగించే యోచన
హైదరాబాద్ సిటీ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మరికొంత కాలంపాటు హెచ్‌ఎంఆర్ సంస్థలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న రెండో దశ ప్రాజెక్టు నేపథ్యంలో ఆయన సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సేవలను పునరుద్ధరించడంలో భాగంగా తాజాగా విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఎన్వీఎస్ రెడ్డికి చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో ఏడుగురు మెట్రో చీఫ్ ప్రాజెక్టు ఆఫీసర్లు, సీనియర్ ఇంజనీర్లను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ చేసి, కాంట్రాక్టుపై పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మెట్రో రెండో దశ నేపథ్యంలో..
రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రాజెక్టును కీలకంగా భావిస్తోంది. ఓల్డ్‌సిటీ, ఎయిర్‌పోర్టు, ఫోర్త్‌సిటీ, నార్త్‌సిటీ లాంటి ప్రాంతాలకు సైతం మెట్రో రైలును నడిపించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్ట్-ఏ కింద 5 కారిడార్లు, పార్ట్-బీ కింద 3 కారిడార్లను ప్రతిపాదించింది. కాగా, పార్ట్-ఏ లోని 5 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను 5 నెలల క్రితం కేంద్రానికి పంపించారు. మరికొద్ది రోజుల్లోనే దీనికి అనుమతి లభించే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. మోదీ సర్కార్ డీపీఆర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే పనులను త్వరగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంఽధించి కీలక విషయాలపై అవగాహన కలిగిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సేవలు తప్పనిసరి అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్న తరుణంలో ఆయన సేవలను మరికొంతకాలం వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 01 , 2025 | 05:03 AM