ABN
, Publish Date – Apr 02 , 2025 | 01:37 PM
Metro Timings: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో. జర్నీ టైమింగ్స్ విషయంలో మార్పులు చేసింది. మరి.. కొత్త టైమింగ్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Hyderabad Metro
హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రయాణికుల రాకపోకలు భారీగా ఉంటాయి. 24 గంటలు పాటు మేల్కొని ఉండే ఇలాంటి సిటీల్లో రాత్రిపూట కనీసం 12 గంటల వరకైనా ప్రయాణ సేవలు అందుబాటులో ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. మన భాగ్యనగరంలో తక్కువ కాలంలోనే పాపులర్‌గా మారిన మెట్రో రైలు సర్వీసుల విషయంలోనూ అనేక మంది ప్రయాణికులు రాత్రి 12 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఇది నెరవేరింది. ప్యాసింజర్లకు తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో.
కొత్త టైమింగ్స్ ఇవే..
మెట్రో రైల్ సమయం పొడిగించారు. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మెట్రో రైల్ సమయాన్ని పొడిగించారు హైదరాబాద్ మెట్రో అధికారులు. మారిన టైమింగ్స్ ప్రకారం.. ఇక మీదట సోమవారం నుంచి శుక్రవారం వరకు.. ఆయా టెర్మినల్ స్టేషన్స్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి మెట్రో రైలు ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి రాత్రి 11 గంటల 45 నిమిషాల దాకా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. శనివారం నాడు ఆయా టెర్మినల్ మెట్రో స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు తొలి మెట్రో స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల వరకు రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక నుంచి ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు ఆయా టెర్మినల్ స్టేషన్ నుంచి ఫస్ట్ మెట్రో రైలు మొదలవుతుంది. సండే కూడా రాత్రి 11 గంటల వరకే రైళ్ల రాకపోకలు ఉంటాయి.
ఇవీ చదవండి:
ఇందిర ఆశయాలు తుంగలోకి.. ప్రొఫెసర్లు సీరియస్
జగన్‌పై ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం ముట్టడి
వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date – Apr 02 , 2025 | 01:40 PM