Hyderabad IT Hall: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

Written by RAJU

Published on:

హైదరాబాద్, ఏప్రిల్ 28: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థానీలను దేశం నుంచి పంపించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. అందులోభాగంగా హైదరాబాద్‌లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి రషెల్ షేక్(31)ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. బంగ్లాదేశ్‌కి చెందిన రషెల్ షేక్.. దొంగచాటుగా భారత్‌లోకి చొరబడనట్లు పోలీసులు గుర్తించారు. తప్పుడు పత్రాలతో ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్,పాన్ కార్డు సైతం అతడు పొందినట్లు పోలీసులు కనుగొన్నారు.

వాటి ద్వారా పోచారం ఐటి కారిడార్‌లోని చౌదరిగూడా మక్తాలోని వెంకట సాయి ప్రేమ్ నగర్‌లో అతడు నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. 2008-2009 మధ్య అతడు భారత్‌లోకి చొరబడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2014 నుంచి అతడు హైదరాబాద్ నగరంలో పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రషెల్ షేక్‌పై ఇప్పటికే పలు వ్యభిచార కేసులు నమోదయినట్లు పోలీసులు వివరించారు. ఆ తర్వాత నగర శివారు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఏప్రిల్ 22వ తేదీ పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఈ ఇరు దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు చేసుకొన్నాయి. ఆ క్రమంలో భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీయులకు 48 గంటల గడువు విధించి.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

అలాగే న్యూఢిల్లీలోని పాక్ రాయబారిని సైతం దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అందుకు వారికి వారం రోజుల గడువు విధించింది. అదే విధంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీలను గుర్తించి.. వారి వారి స్వస్థలాలకు వెళ్లేలా చూడాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.

దీంతో రంగంలోకి దిగిన పలు రాష్ట్రాల పోలీసులు.. ముమ్మర తనిఖీలు చేపట్టారు. అందులోభాగంగా వివిధ రాష్ట్రాల్లో పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు ఉన్నట్లు గుర్తించారు. వారి వివరాలను ఇప్పటికే కేంద్రానికి ఆయా రాష్ట్రాలు నివేదించాయి.

ఇవి కూడా చదవండి:

Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్

India Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌కు 4 రోజుల్లో 537 మంది ప్రయాణం

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా


Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

For National News And Telugu News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights