Hyderabad Cricket Fans Prayers For Team India

Written by RAJU

Published on:


  • నేడు దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్..
  • ఫైనల్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్..
  • ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలవాలని క్రికెట్ అభిమానులు పలుచోట్ల పూజలు..
Hyderabad Cricket Fans Prayers For Team India

Champions Trophy Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. నేడు దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోబోతున్న భారత్.. ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. హాట్ ఫేవరెట్ చక్ దే ఇండియా స్లోగన్స్ తో హోరెత్తిస్తున్నారు. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ సేన విజయం సాధించాలని అభిమానులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. అయితే, ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు బిగ్ ఫైట్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల ఫామ్ అద్భుంగా ఉంది. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో భారత్, న్యూజిలాండ్ టీమ్స్ సమజ్జీవులుగా ఉన్నాయి. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా ఎక్కడ కివీస్ బ్యాటర్లు తడబడలేదు.

Read Also: WPL 2025: ఆర్సీబీకి షాక్.. టోర్నమెంట్ నుంచి ఔట్

అయితే, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా పైనే మొత్తం జట్టు ఆధారపడి ఉంది. లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టును నిలువరించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై భారత్ గంపెడు ఆశలు పెట్టుకుంది. కివీస్ బ్యాటర్లను తమ వైవిధ్యమైన బౌలింగ్ తో కట్టడి చేయడానికి టీమిండియా పెస్ & స్పిన్ యంత్రం సిద్ధమవుతుంది. అయితే, ఈ టోర్నీలో టాస్ కీలకంగా మారింది. ఇక, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో రోహిత్ సారథ్యంలో టీమిండియా ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగనుంది.

Subscribe for notification