Hyderabad: హోటళ్లలో లోట్టలేసుకుని తింటున్నారా.. ఇది చూస్తే జీవితంలో..

Written by RAJU

Published on:

హైదరాబాద్, మార్చి 21: బిర్యానీ.. కమ్మటి గుమ గుమల వాసనతో నోరూరిస్తుంది. అందుకే ఆహార ప్రియులు బిర్యానీ పేరెత్తితే చాలు ఆహా అనేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఫేవరెట్ ఫుడ్ బిర్యానీనే. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీ తినే వారి సంఖ్య బీభత్సం అనాల్సిందే. సందర్భమేదైనా సరే బిర్యానీ బుక్ చేసేద్దామా అనేస్తుంటారు. లేదా రెస్టారెంట్‌కు వెళ్లిపోదామా అనేస్తుంటారు. ఇక టేస్ట్ కోసం హోటళ్ల సెలక్షన్ కూడా ఉంటుందండోయ్. ఆ హోటల్ అయితే బాగుంటుంది.. ఈ హోటల్‌లో ఈ ఫుడ్ బాగుంటుందని ఎవరి అభిప్రాయాలు వారు చెప్పేసుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే.. అన్నీ ఒకటేనని నిజం తెలిసేంత వరకు మనం తెలియదు. అలాంటి నిజానిజాలనే ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేస్తున్నారు. టేస్టీ ఫుడ్ వెనుక.. ఎంత గలీజ్‌ ఉంటుందో ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

తాజాగా డబీర్‌పురలో పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా కుళ్లిపోయిన మాంసం పట్టుబడింది. హోటళ్లలో కుళ్లిన మేక, గొర్రెల మాంసాన్ని గుర్తించారు అధికారులు. డబీర్‌పుర మాతాకీ కిడికిల అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా స్టోర్ చేసిన మాంసాన్ని గుర్తించారు. ఆ మాంసాన్ని సీజ్ చేశారు. పాడైపోయిన మటన్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి.. పెళ్లిళ్లు, హోటల్స్‌కి సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 2 క్వింటాళ్ల పాడైన మాంసాన్ని అధికారులు రికవరీ చేశారు.

జీహెచ్ఎంసీ అధికారులు, టాస్స్ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. గోషామహల్‌లోనూ భారీగా కుళ్లిన మటన్ మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. ఓల్డ్ సిటీ అడ్డాగా ఈ దందా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాడైపోయిన ఈ మాంసం స్టోర్ చేసి.. తక్కువ ధరకే వ్యాపారులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read:

పులుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

జడ్జి ఘటనలో భారీ ట్విస్ట్

ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన తనయ

For More Telangana News and Telugu News..

Subscribe for notification