
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే పాసింజర్స్‌కు గుడ్ న్యూస్. రైలు సమయాన్ని పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు లాస్ట్ మెట్రో రైలు నైట్ 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి రీచ్ అవుతుంది. ఇకపై చివరి మెట్రో రైలు 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరి 1:10 నిమిషాలకు గమ్యం చేరుకోనుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేషన్‌లలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీంతో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచులు వీక్షించేవారికి.. ఆ మార్గాల గుండా ప్రయాణించేవారికి ఈ సౌకర్యం ఉపయోగకరం.
మార్చి 22న నుంచి IPL-2025 సీజన్ స్టార్ట్ అవుతున్న క్రమంలో మెట్రో ఈ సౌకర్యాన్ని కల్పించింది. మార్చి 22 నుంచి ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేవరకు ఆ స్టేషన్స్ గుండా లాస్ట్ ట్రైన్స్.. రాత్రి 12.15 గంటలకు స్టార్ట్ అయ్యి.. 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో యాజమాన్యం వెల్లడించింది. భారత్‌లో బిగ్ క్రికెట్ ఫెస్టివల్ “ఐపీఎల్-2025” మార్చి 22 నుంచే స్టార్ట్ అవుతోంది. ఫస్ట్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. తెలంగాణలోని ఐపీఎల్ అభిమానులకు ఈసారి మాములు బోనాంజా కాదు.. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఈ సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది.
హైదరాబాద్‌లో జరగనున్న 9 మ్యాచుల్లో 7 లీగ్ మ్యాచ్‌లు కాగా.. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు 2 ఉన్నాయి. ఉప్పల్‌లో ఈ ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో హోమ్ టీమ్ సన్‌రైజర్స్.. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. తొలి మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభమవుతుండగా.. హైదరాబాద్‌లో జరిగే మిగిలిన మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు స్టార్టవుతాయి. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 27న లక్నో, ఏప్రిల్ 6న గుజరాత్, ఏప్రిల్ 12న పంజాబ్, ఏప్రిల్ 23న ముంబై, మే 5న ఢిల్లీ, మే 10న కోల్‌కతా టీమ్స్‌తో తలపడుతుంది. ఇక మే 20న క్వాలిఫయర్-1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఉప్పల్‌లో జరుగుతాయి.